వైఎస్సార్సీపీ నేత చింతరెడ్డి లోకేశ్‌రెడ్డి అరెస్ట్‌ | YSRCP Leader ChintaReddy Lokesh Reddy Arrested | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ నేత చింతరెడ్డి లోకేశ్‌రెడ్డి అరెస్ట్‌

Oct 28 2026 12:50 PM | Updated on Oct 28 2026 12:56 PM

YSRCP Leader ChintaReddy Lokesh Reddy Arrested

సాక్షిప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చింతరెడ్డి లోకేశ్‌రెడ్డిని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి ఉదయగిరి కోర్టుకు తరలించారు. ఎంపీటీసీ బరిలో నిలిచిన పార్టీ అభ్యర్థుల బీ ఫారాలను సమర్పించేందుకుగానూ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఈయన్ను ఖాకీలు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఎంపీపీ అభ్యర్థయిన ఈయన నామినేషన్‌ పత్రాన్ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించిన విషయం విదితమే. 

ఎంపీడీఓ కార్యాలయంలోని నోటీస్‌ బోర్డులో పేర్ల జాబితాను చూసేందుకు ఆదివారం రాత్రి వచ్చిన లోకేశ్‌రెడ్డిపై అక్రమ కేసును బనాయించిన సంగతి తెలిసిందే. పోలీస్‌స్టేషన్లో నిర్బంధించారనే విషయాన్ని తెలుసుకున్న పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి చేరుకొని ఎస్సై వెంకటరాజేష్‌తో మాట్లాడారు. లోకేశ్‌రెడ్డిని పరామర్శించారు. స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి ఆ తర్వాత ఉదయగిరి కోర్టుకు తరలించడం మండలంలో చర్చనీయాంశమైంది.  

ఇదీ చదవండి: నేను రాజకీయం చేస్తే తట్టుకోలేరు

ఆర్వో వైఖరిని నిరసిస్తూ ఎన్నికల బహిష్కరణ
చేజర్ల: కూటమి నేతల మాటలు విని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఏకపక్షంగా తిరస్కరించినందుకు నిరసనగా మండలంలో మిగిలిన ఇద్దరు ఎంపీటీసీ డమ్మీ అభ్యర్థులతో నామినేషన్లను విత్‌ డ్రా చేయించి ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కనీ్వనర్‌ బోయిళ్ల మాలకొండారెడ్డి తెలిపారు. ఈ మేరకు చేజర్లలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. 

ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నిర్ణయం మేరకు ఎంపీటీసీ ఎలక్షన్లను బాయ్‌కాట్‌ చేస్తున్నామని వివరించారు. నామినేషన్లను తిరస్కరించినంత మాత్రాన తమ పార్టీ, జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎవరూ చెరపలేరని, ఎన్నికలెప్పుడు జరిగినా విజయం తమదేనని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులను భయపెట్టి.. ఆర్వోను అడ్డంపెట్టుకొని మోసంతో ఏకగ్రీవంగా ఎన్నికైన పదవులూ ఒక పదవులేనానని ప్రశ్నించారు. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి బాలిరెడ్డి రమాదేవిని గెలిపించాలని కోరారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement