పొత్తు కుదరక.. పోటీ తప్పక! | Kutami Leaders Fight For MPTC Seats | Sakshi
Sakshi News home page

పొత్తు కుదరక.. పోటీ తప్పక!

Oct 28 2026 11:42 AM | Updated on Oct 28 2026 11:47 AM

Kutami Leaders Fight For MPTC Seats

విశాఖపట్నం: సబ్బవరం మండలంలో పరిషత్‌ ఎన్నికల సీట్ల సర్దుబాటు కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. అధికారంలో కలిసి ఉన్న టీడీపీ, జనసేన మధ్య సయోధ్య కుదరక.. పొత్తు లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి. ఒకవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పూర్త జోష్‌తో బరిలో దిగితే.. కూటమి మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన అభ్యర్థులు పరస్పరం తలపడాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. 

ప్చ్‌.. ఏకాభిప్రాయం కుదరలే..! 
మండలంలో మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, జనసేన తరఫున తొలుత తొమ్మిది మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు బీఫారాలు అందించారు. మిగిలిన తొమ్మిది స్థానాల్లో టీడీపీ, మరో స్థానంలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని భావించారు. కానీ, టీడీపీ నుంచి ఏకంగా 13 మందికి బీఫారాలు అందడంతో అసలు కథ అడ్డం తిరిగింది. సీట్ల పంపకాలపై కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్న విషయం బహిర్గతమైంది. ఫలితంగా నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు ముఖాముఖి తలపడుతున్నారు.  

‘మిత్ర’పోరుతో.. త్రిముఖ పోటీ! 
బోదువలస: వైఎస్సార్‌సీపీ తరఫున కోన గణేష్‌ బరిలో ఉండగా, జనసేన నుంచి కంచిపాటి రాంబాబు, టీడీపీ నుంచి అమరపిన్ని నరసింగరావు పోటీ చేస్తున్నారు.  

సబ్బవరం–1: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పల్ల కృష్ణకు పోటీగా జనసేన నుంచి రోమాల చంద్రశేఖర్, టీడీపీ నుంచి గెడ్డం రమేష్‌ బరిలో నిలిచారు.  

మల్లునాయుడుపాలెం: వైఎస్సార్‌సీపీ నుంచి సబ్బవరపు దివ్య వరలక్ష్మి బరిలో నిలవగా, జనసేన నుంచి నెక్కల యామిని, టీడీపీ నుంచి గండి వెంకట రమణమ్మ ప్రత్యర్థులుగా మారారు.  

తవ్వవానిపాలెం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బోకం లక్ష్మికి పోటీ చేస్తుండగా జనసేన నుంచి ఒనం వరలక్ష్మి, టీడీపీ నుంచి బోకం సూర్యుడమ్మ బరిలో ఉన్నారు.   

ఇదీ చదవండి: గెలిపిస్తే.. గీతం భూములపై తొలి తీర్మానం!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement