నాలుగు రీ–షెడ్యూల్.. మూడు రద్దు
తుపాను ప్రభావంతో బుధవారం మూడు రైళ్లను రద్దు చేశారు. అవి ఏంటంటే
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలపై మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల భద్రత, రైళ్ల నిర్వహణ దృష్ట్యా 4 రైళ్లను రీషెడ్యూల్ చేయడంతోపాటు మరో రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే డివిజన్(విజయవాడ) బుధవారం వెల్లడించింది. గుంతకల్లు–విశాఖ(18522) రైలు అక్టోబర్ 29న గుంతకల్లు నుంచి కాకుండా తిరుపతి నుంచి ప్రారంభం కానుంది. దీంతో గుంతకల్లు–తిరుపతి మధ్య ఈ రైలు రాకపోకలు రద్దయ్యాయి. అలాగే, విశాఖ–లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) రైలును దారి మళ్లించారు. ఈ రైలు ఉదయం 4 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి దువ్వాడ–ఏలూరు–విజయవాడ మీదుగా ప్రయాణించేలా మార్పు చేశారు. దీంతో తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ స్టేషన్లలో ఈ రైలు వెళ్లలేదు.

తుపాను ప్రభావంతో బుధవారం మూడు రైళ్లను రద్దు చేశారు. అవి ఏంటంటే
సికింద్రాబాద్–విశాఖ(20834) నరసాపూర్–తూత్తుకుడి (06020), నరసాపూర్–తిరువణ్ణామలై (17291)
బయలుదేరే సమయం మారిన 5 రైళ్లు
చెన్నై సెంట్రల్–హౌరా(12842)– 2 గంటలు ఆలస్యం
గుంటూరు–డోన్(17228)– గంటన్నర ఆలస్యం
ఎర్నాకుళం–బిలాస్‌పూర్ (22816)– 3 గంటలు ఆలస్యం
ఎస్‌ఎంవీటీ బెంగళూరు–హౌరా(12864)– గంట ఆలస్యం
సీఎస్‌ఎంటీ ముంబై–చెన్నై సెంట్రల్(22159)– గంట 45 నిమిషాలు ఆలస్యం


