కన్నీటి వెతనం | - | Sakshi
Sakshi News home page

కన్నీటి వెతనం

Feb 26 2026 7:34 AM | Updated on Feb 26 2026 7:34 AM

కన్నీ

కన్నీటి వెతనం

కన్నీటి వెతనం ప్రత్తిపాడు: ఆకలి కేకలతో కడుపు మండిన కార్మికులు విధిలేని పరిస్థితుల్లో విధులను బహిష్కరించారు. దీంతో వీధులన్నీ చెత్త కుప్పలతో నిండాయి. వారితో పాటు వాటర్‌ మోటర్‌ ఆపరేటర్లు, విద్యుత్‌ సిబ్బంది కూడా విధులకు దూరంగా ఉండటంతో ప్రత్తిపాడు వాసుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రత్తిపాడు పంచాయతీలో పదిహేను మంది పారిశుద్ధ్య కార్మికులు, నలుగురు వాల్వు ఆపరేటర్లు, ఒక ఫిట్టర్‌ ఆపరేటర్లు, ఒక ఎలక్ట్రీషియన్‌తో పాటు నలుగురు స్వీపర్లు పని చేస్తున్నారు. వీరిలో పారిశుద్ధ్య కార్మికులకు సుమారు ఐదు నెలలుగా, పంపు ఆపరేటర్లకు ఏడు నెలలుగా, విద్యుత్‌ సిబ్బందికి నాలుగైదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. వారు అడిగిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పడం, తరువాత ఒక్కొక్కరికి రూ. 5 వేలో, రూ.10 వేలో ఇచ్చి నెట్టుకొస్తుండటం పరిపాటిగా మారింది. పంచాయతీ నుంచి వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో కార్మికులు స్థానికంగా ఉన్న దుకాణాల్లో అప్పులు చేసి సరుకులు తెచ్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ సారి నెలల తరబడి కార్మికుల వేతనాలను అధికారులు చెల్లించకపోవడంతో కిరాణా దుకాణాలలో కూడా అప్పులు పుట్టడం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. వ్యర్థాల కుప్పలు.. నీటి కోసం తిప్పలు పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం నిరసనకు దిగారు. ఇటీవల కొద్ది రోజుల కిందట మండల పరిషత్‌ కార్యాలయం వద్ద కార్మికుల జీతాల పంచాయతీ జరిగింది. అయినా ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు. తాజాగా సోమవారం పంచాయతీలో పని చేస్తున్న సిబ్బంది అంతా విధులను బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. మంగళవారం, బుధవారం కూడా విధులకు హాజరు కాకపోవడంతో ప్రత్తిపాడులో ఎటు చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. అలానే నీటి సిబ్బంది కూడా వాటర్‌ వదలక పోవడంతో ఊరంతా తాగు నీటి కోసం దిక్కులు చూడాల్సిన దుస్థితి చోటుచేసుకుంది. ఇప్పటికై నా అధికారులు పంచాయతీ కార్మికులపై కనికరం చూపి వేతనాలు చెల్లించాలని ప్రజలు, కార్మికులు కోరుతున్నారు.

ఏడు నెలలుగా వేతనాల్లేవు

జీతాలు సక్రమంగా ఇవ్వాలి

పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాల్లేవు. ఎరియర్లు కూడా ఇవ్వలేవు. ప్రతి నెల మా జీతాలు బ్యాంకు ఖాతాలకు జమ చేసేలా చూడాలి. ఒక పూట సెలవు అవకాశం ఉంది. దానిని కూడా అమలు చేయాలి. నెల నెలా సక్రమంగా జీతాలు చెల్లించాలి.

మాకు పది నెలల జీతాలు రావాలి. అందులో మూడు నెలలు అడ్వాన్సుగా ఇచ్చారు. ఇంకా ఏడు నెలలవి రావాల్సి ఉంది. బతుకే కష్టంగా మారింది. సరుకుల కోసం షాపులకు వెళ్లాలన్నా ఇబ్బందిగా మారింది. పెంచుతామన్న జీతం కూడా ఇంత వరకూ పెంచలేదు.

విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలుకు ప్రణాళిక

పారిశుద్ధ్య కార్మికులకు

నెలలుగా అందని జీతాలు

అప్పులు పుట్టక..

ఆకలి తీరక నానా కష్టాలు

జీతాలివ్వాలని మొర

పెట్టుకుంటున్నా ఫలితం శూన్యం

గత్యంతరం లేక విధుల బహిష్కరణ

ఊరంతా పేరుకుపోయిన చెత్త

నిలిచిపోయిన తాగునీటి సరఫరా

సర్కారు తీరుతో ప్రజలకు

తప్పని వెతలు

వారంతా పారిశుద్ధ్య కార్మికులు.. నిత్యం చెత్తలోనే బతుకు పయనం.. వారికి నెల నెలా సక్రమంగా వేతనాలివ్వకున్నా ఆకలి బాధలు భరిస్తూ నిత్యం ‘స్వచ్ఛ’మైన బతుకు పోరాటం చేస్తున్నారు. ఇటు పాలకులుగానీ, అటు అధికారులుగానీ కనీసం వారిపై కనికరం కూడా చూపడం లేదు. వారి నిరసన ప్రభావంతో స్థానికులకూ ఇబ్బందులు తప్పడం లేదు.

తడిస్తే జారే.. ఎండితే బేజారే!

జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా

– సీహెచ్‌ థామస్‌ (పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు)

– వి. భాస్కర్‌ (నీటి సరఫరా ఆపరేటర్‌)

కన్నీటి వెతనం 1
1/4

కన్నీటి వెతనం

కన్నీటి వెతనం 2
2/4

కన్నీటి వెతనం

కన్నీటి వెతనం 3
3/4

కన్నీటి వెతనం

కన్నీటి వెతనం 4
4/4

కన్నీటి వెతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement