ఏఎన్‌యూలో పీజీ సమన్వయకర్త తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూలో పీజీ సమన్వయకర్త తనిఖీలు

Feb 26 2026 7:34 AM | Updated on Feb 26 2026 7:34 AM

ఏఎన్‌

ఏఎన్‌యూలో పీజీ సమన్వయకర్త తనిఖీలు

ఏఎన్‌యూలో పీజీ సమన్వయకర్త తనిఖీలు ఆంధ్రా అబ్బాయి.. సింగపూర్‌ అమ్మాయి..!

ఏఎన్‌యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పరీక్షలపై వస్తున్న వరుస కథనాలకు స్పందించిన పీజీ కోర్సుల సమన్వయకర్త ఆచార్య మన్నం సుబ్బారావు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కొన్ని లోపాలను గుర్తించినట్లుగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఓ విభాగంలో సదరు అధ్యాపకులు ఉన్నప్పటికీ పరిశోధక విద్యార్థులతో పరీక్షల పరిశీలన చేయించడం గుర్తించామన్నారు. ఎవరికి కేటాయించిన డ్యూటీలను వారే చేయాలని, సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. ప్రశ్నపత్రాల్లో తప్పులపై స్పందించకపోవడం గమనార్హం.

చీరాల: ఆంధ్రా అబ్బాయి.. సింగపూర్‌ అమ్మాయి ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. బాపట్ల మండలం కంకటపాలేనికి చెందిన యార్లగడ్డ వెంకట సుబ్బారావు కుమారుడు సాయి సూర్య, సింగపూర్‌ దేశానికి చెందిన ఎన్‌జీ షా చ్యూ–వాంగ్‌ క్వీయిన్‌ దంపతుల కుమార్తె రోయని ఎన్‌జీలువో యాన్‌ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి బుధవారం చీరాల్లో వివాహం చేసుకున్నారు. బుధవారం ఉదయం 10.29 నిమిషాలకు తెలుగు సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.

ఏఎన్‌యూలో పీజీ  సమన్వయకర్త తనిఖీలు  1
1/1

ఏఎన్‌యూలో పీజీ సమన్వయకర్త తనిఖీలు

Advertisement
 
Advertisement
Advertisement