రోడ్డెక్కిన కూటమి రచ్చ
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026 రోడ్డెక్కిన కూటమి రచ్చ సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. దీంతో రాజా వర్గం రోడ్డెక్కిందని చెబుతున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు మనోహర్ సన్నద్ధమైనట్టు తెలిసింది. కూటమి పార్టీల పొత్తుతో ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పదవిని చేపట్టారు. పొత్తు ధర్మంలో తెనాలి సీటును కోల్పోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కి పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది తెలుగుదేశం పార్టీ. తెనాలిలో తన ప్రాభవాన్ని కోల్పోవడానికి ఇష్టపడని ఆలపాటి రాజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దూకుడు ప్రదర్శించారు. గతేడాది సంక్రాంతి పండక్కి కోడి పందేలను నిర్వహించకుండా అడ్డుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో స్వయంగా రాజానే వెళ్లి పందేలను ఆరంభించటంతో వేడి రాజుకుంది. పట్టణంలో నిర్మించే భవనాల్లో 4, 5వ అంతస్తులకు రాజా సానుకూలతను చూపినా మంత్రి మనోహర్ విభేదించిన విషయం తెలిసిందే.
దక్కని ప్రాధాన్యత
పదవి లేనప్పుడు ప్రభుత్వ అధికారిక సభలు, సమావేశాల్లో రాజాకు ఆహ్వానం లేకుండాపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఆలపాటికి కేంద్రమంత్రి పెమ్మసాని ద్వారా కొన్ని పనులు అయ్యాయి. పెద్దగా పనులు కావటం లేదనే భావన ఆయనలో ఉంది. టీడీపీ నాయకులు వెళ్లినా మనోహర్ నుంచి తగిన స్పందన లేదనే భావన ఆ పార్టీ వర్గీయుల్లో కనిపిస్తోంది. మనోహర్‌కే అధికారులు ప్రాధాన్యత ఇవ్వటంతో టీడీపీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్‌ను పదవి నుంచి దింపి, టీడీపీ హస్తగతం చేసుకుందామని కౌన్సిలర్లు చేసిన ప్రయత్నానికీ మనోహర్ సాయం చేయలేదు.
నామినేటెడ్ పదవుల్లోనూ...
స్థానిక మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని టీడీపీ వర్గీయులు ఆశించారు. మంత్రి మనోహర్ మాత్రం యాదవ సామాజికవర్గానికి చెందిన తోట దుర్గాప్రసాద్‌కు వచ్చేలా చక్రం తిప్పారు. వైస్‌చైర్మన్ పదవి టీడీపీకి, పాలకవర్గ సభ్యులు చెరో సగం ప్రకారం ఒప్పందం జరిగిందని చెబుతారు. దుర్గాప్రసాద్ నియామకం తర్వాత పాలకవర్గంలోని ఇతర పదవులకు టీడీపీ తరఫున పేర్లను ఇవ్వలేదు. దీంతో దుర్గాప్రసాద్ నాలుగైదు నెలలుగా కేవలం చైర్మన్ పదవికి పరిమితమయ్యారు. ప్రమాణస్వీకారం, బాధ్యతలు చేపట్టడం వంటివి లేకుండాపోయాయి. దీంతోపాటు మరో కీలకమైన వైకుంఠపురం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకం కూడా పెండింగులో ఉండిపోయింది. సాగని టీడీపీ నేతల ఆటలు
న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
2014–19 కాలంలో ఒక్కో ప్రభుత్వ కార్యాలయాన్ని ఒక్కో టీడీపీ నాయకుడు అడ్డాగా మార్చుకుని, కావాల్సిన పనులను చేయించుకున్నారని తెనాలిలో అందరికీ తెలుసు. మనోహర్ వచ్చిన తర్వాత అది సాధ్యం కావటం లేదు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తెనాలిలో నియోజకవర్గ మెగా గ్రీవెన్స్‌ను నిర్వహించారు. సమావేశం తర్వాత కేంద్రమంత్రి పెమ్మసానిని మాత్రమే మనోహర్ తన ఇంటికి భోజనానికి తీసుకెళ్లారని, ఆలపాటిని పిలవలేదని ఆయన వర్గీయులు ఇప్పటికీ కినుకతో ఉన్నారు. అధికారులు మనోహర్‌కు జవాబుదారీగా ఉండటం, కార్యకర్తలకు పనులు కాకపోవటంతో ఎమ్మెల్సీగా ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానిస్తున్నా మంత్రి మనోహర్ కార్యక్రమాలకు ఆలపాటి దూరంగా ఉంటున్నారు. టీడీపీ తరఫున పోటీగా గ్రీవెన్స్ నిర్వహించటం, సీఎంఆర్‌ఎఫ్ నిధులను తెప్పిస్తూ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.
గుంటూరు
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026
● తెనాలి నేతల మధ్య ముదిరిన గొడవ
● ఆధిపత్యం పోకూడదని
ఎమ్మెల్సీ రాజా ఆరాటం
● ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్న
మంత్రి మనోహర్
● ఫ్లెక్సీ పేరుతో రోడ్డెక్కిన
ఆలపాటి వర్గం
● టీడీపీ పెద్దలకు ఫిర్యాదు
చేసేందుకు మంత్రి సిద్ధం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 3900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 39.8368 టీఎంసీలు.
తెనాలి వేదికగా కూటమిలో విభేదాలు రోడ్డున పడ్డాయి. తెనాలిలో గెలిచి మంత్రిగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ ఆధిపత్యానికి గండి కొట్టి తన పట్టు నిలుపుకోవడం కోసం ఎమ్మెల్సీ ఆలపాటి రాజా చేస్తున్న ప్రయత్నాలు కూటమిలో చిచ్చు పెడుతున్నాయి. మంగళవారం ఫ్లెక్సీల తొలగింపునకు పూనుకున్న మున్సిపల్ అధికారులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.
1/4
రోడ్డెక్కిన కూటమి రచ్చ
2/4
రోడ్డెక్కిన కూటమి రచ్చ
3/4
రోడ్డెక్కిన కూటమి రచ్చ
4/4
రోడ్డెక్కిన కూటమి రచ్చ