పోలవరంపై బాబు అబద్ధాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): పోలవరం ప్రాజెక్ట్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థనగర్‌లోని ఆయన తన నివాసంలో బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెబుతుంటారని ధ్వజమెత్తారు. ఆయనకు మీడియా బలం ఉందని, ఆ మీడియాలో మొదటి పేజీలో అబద్ధాన్ని అచ్చువేసి, మళ్లీ రాష్ట్ర ప్రజలకు చెబుతారని మండిపడ్డారు. డయాఫ్రం వాల్ వేయడంలో ప్రొటోకాల్‌ను విస్మరించింది చంద్రబాబు ప్రభుత్వమని ఆరోపించారు. డయాఫ్రం వాల్ వేయాలంటే ముందు కాఫర్ డ్యాం కట్టాలనే జ్ఙానం లేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. కాఫర్ డ్యాం వేయకుండా డయాఫ్రం వాల్ ఎలా వేశారని చంద్రబాబును సూటిగా అడుగుతున్నానని అన్నారు. ప్రాజెక్ట్ అలస్యమయ్యేందుకు చంద్రబాబే కారణమని స్పష్టం చేశారు. నది డైవర్షన్ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌దే అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనవసరమని గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీని కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని హితవు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బాగు కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య అయినా పరిష్కారించారా అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌పై ఆరోగ్యకరమైన చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఈ ప్రాజెక్ట్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలల పంటని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబుకి ఏటీఎం కార్డు వంటిదని గతంలో జరిగిన ఎన్నికల వేళల్లో ప్రధాని మోదీ చెప్పారని ఆయన గుర్తుచేశారు. పొలవరం ప్రాజెక్ట్ 45.7 లెవల్‌కు నీరు నింపామని, అయితే చంద్రబాబు 41.1కు కుదించారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని వాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్‌లపై కనీసం ఎవరూ దృష్టి సారించలేదని తెలిపారు.
నది డైవర్షన్ చేసిన ఘనత
మాజీ సీఎం వైఎస్ జగన్‌దే
తెలంగాణలో టీడీపీని
కాపాడుకునేందుకు
చంద్రబాబు ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను
తెలంగాణకు తాకట్టు
పెడుతున్న సీఎం
మాజీ మంత్రి, వై ఎస్సార్‌సీపీ
గుంటూరు జిల్లా అధ్యక్షులు
అంబటి రాంబాబు ధ్వజం


