ఏపీలో మరో​ బస్సు ప్రమాదం | RRR Travel Bus Caught Fire Near The Kovvur Gammon Bridge At Midnight, Watch News Video For More Details | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో​ బస్సు ప్రమాదం

Jan 7 2026 6:58 AM | Updated on Jan 7 2026 9:49 AM

Travel Bus Caught Fire Near The Kovvur Gammon Bridge

సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద  ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రావెల్ బస్సుగా గుర్తించారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూటే కారణమని డ్రైవర్‌ తెలిపాడు. సుమారు అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement