రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్‌ చేసిందేమీ లేదు | Ambati Rambabu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్‌ చేసిందేమీ లేదు

Jun 5 2026 4:34 PM | Updated on Jun 5 2026 6:33 PM

Ambati Rambabu Fires On Chandrababu

సాక్షి,అమరావతి: రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్‌ చేసిందేమీ లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

‘ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. చేసింది చెప్పుకోవాలన్నా ఏమీ కనిపించడం లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద బురద జల్లడం, అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి మాత్రమే చంద్రబాబు పని చేస్తున్నారు.

లిక్కర్‌ స్కాం జరగకున్నా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతీ పైసా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది. చంద్రబాబు గతంలో లిక్కర్‌ పేరుతో లెక్కలేనన్ని స్కాములు చేశారు. లిక్కర్‌లో చంద్రబాబు రూ.25వేల కోట్ల స్కాం చేశారు. చంద్రబాబు 40వేల బెల్టు షాపులు నడిపించారు. రాష్ట్ర ఖజానాకు రూ.5వేల కోట్లుకుపైగా నష్టం చేకూర్చారు. వ్యవస్థలు మేనేజ్‌ చేసి కేసులు క్లోజ్‌ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు 20కోట్ల భారీ స్కాం, బయటపెట్టిన అంబేటి రాంబాబు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement