సాక్షి,తాడేపల్లి: ఎల్లోమీడియాపై మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఏవీఎస్‌వీ సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేస్తోందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పేర్నినాని మీడియాతో మాట్లాడారు.
రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. టీటీడీ మాజీ ఏవీఎస్‌ఈవో చనిపోతే ఆయన ఇంటిని పోలీసులే జల్లెడ పట్టారు. కనీసం సానుభూతి కూడా చూపించలేదు.
సతీష్ కుమార్‌పై ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తోంది. సతీష్ కుమార్‌ది అసలు ఆత్మహత్య?హత్య?అని తెలుసుకునేలోపే ఇల్లంతా జల్లెడపట్టారు. సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాక్కున్నారు. ఆ ఫోన్ ఎక్కడుందో ఇప్పటి వరకూ తెలియదు. సతీష్ కుమార్ కాల్ డేటా ఎక్కడ? అని ప్రశ్నించారు.


