వైఎస్సార్‌టీఏ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరిస్తున్నమాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్(వైఎస్సార్‌టీఏ) నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జంషీద్, ట్రెజరర్ ఎస్.ప్రేమ్ సాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సీకే వెంకట్‌నాథ్‌రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు బి.సురేశ్, ఎం.వి.మహంకాళీరావు, జి.వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


