శివ అంకుల్‌ నా చావుకు కారణం.. ఏటీఎంలా వాడుకున్నాడు..! | Mentada Woman Death Note Alleges Abuse, Betrayal And Exploitation By Journalist, More Details Inside | Sakshi
Sakshi News home page

శివ అంకుల్‌ నా చావుకు కారణం.. ఏటీఎంలా వాడుకున్నాడు..!

May 13 2026 9:35 AM | Updated on May 13 2026 10:17 AM

Mentada Woman Death Note Alleges Abuse And Deception By Journalist

విజయనగరం జిల్లా: ‘శివ అంకుల్‌ నా చావుకు కారణం.. నన్ను ఒక ఏటీఎంలా వాడుకున్నారు.. తీయని మాటలతో నమ్మించి, హోటళ్లకు తీసుకెళ్లి సర్వస్వం దోచుకున్నారు.. 2019 నుంచి తన బాధ్యత, పిల్లల బాధ్యత చూస్తానని నమ్మించి భర్తలా కాపురం చేశాడు... ఆయన స్వార్థానికి నన్ను బలిచేశాడు.. ఆర్థికంగానూ దోచుకున్నాడు. 

నేను ఏ తప్పూచేయలేదు. నన్ను నీవు నమ్మితే చాలు అంటూ తన కుమారుడికి మెంటాడ మండలానికి చెందిన మహిళా నేత రాసిన సూసైడ్‌ నోట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన చివరి కోరికగా తన భర్తగా చలామణి అయిన శివకేశవనాయుడే తనకు తలకొరివి పెట్టాలని ఆ నోట్‌లో పేర్కొంది. విశాఖపట్నంలో మంగళవారం వేకువజామున పురుగులు మందు సేవించిన బాధితురాలు ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్‌లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. 

మెంటాడకు చెందిన ‘పచ్చ’ పత్రిక విలేకరి శివకేశవనాయుడు తనను దోచుకున్న తీరు, మోసం చేసిన తీరును బాధితురాలు తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు స్థానికంగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఆ విలేకరి ఓ మంత్రికి అత్యంత ఆప్తుడు కావడమే దీనికి కారణమని స్థానికంగా చర్చ నడుస్తోంది. కేసు నమోదు విషయాన్ని మెంటాడ ఎస్‌ఐ కె.సీతారాము వద్ద ప్రస్తావించగా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఘటనగా పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement