వేరు శనక్కాయల మూట నుంచి సీఎం కుర్చీ వరకూ.. | Bhumana Karunakar Reddy Fires On Chandrababu, Questions TDP Friendly Media Silence On His Past Political History | Sakshi
Sakshi News home page

వేరు శనక్కాయల మూట నుంచి సీఎం కుర్చీ వరకూ..

May 25 2026 12:40 PM | Updated on May 25 2026 4:48 PM

Bhumana Karunakar Reddy Fires On Chandrababu

సాక్షి, తిరుపతి: చంద్రబాబు గత చరిత్ర చాలా హీనాతిహీమని.. దానిని ప్రసారం చేసే దమ్ము ఎల్లో మీడియాకు ఉందా? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి. చంద్రబాబు ఆదేశాలతో వైఎస్సార్‌ కుటుంబంపై టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన సోమవారం తిరుపతిలో మాట్లాడుతూ మండిపడ్డారు.  

‘‘వైఎస్‌ఆర్‌ మరణాన్ని తట్టుకోలేక 670 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంత్యక్రియలకు ఐదు లక్షల మందికి పైగా హాజరయ్యారు. వైఎస్సార్‌ అభిమానులు ఊరూరా విగ్రహాలు కూడా పెట్టుకున్నారు. అలాంటిది వైఎస్‌ఆర్‌ కుటుంబంపై ఎల్లో మీడియా ఇష్టమొచ్చినట్లు రాతలు రాస్తోంది. అదే పని చంద్రబాబు విషయంలో చేయగలదా? అని భూమన ప్రశ్నించారు. 

చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు కపట నైజంతో ఉండేవారు. నాటకంలో పాత్ర కోసం వేరు శనక్కాయల మూట దొంగలించిన ఘనుడు చంద్రబాబు. మరి ఎల్లో మీడియాకు ఆ వేరు శనక్కాయల మూట గురించి మొదలు.. సీఎంగా ఎదిగే క్రమంలో ఆయన చేసిన పనులన్నీ ప్రసారం చేసే దమ్ముందా?. వైఎస్‌ఆర్‌ భిక్షతోనే చంద్రబాబు మంత్రి అయ్యాడని గుర్తిస్తే మంచిది’’ అని భూమన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement