‘మీరు రాయాల్సింది పవన్‌ కళ్యాణ్‌ గన్‌మెన్‌ అని..’ | YSRCP Leader Dadisetti Raja Takes On Yellow Media | Sakshi
Sakshi News home page

‘మీరు రాయాల్సింది పవన్‌ కళ్యాణ్‌ గన్‌మెన్‌ అని..’

Mar 31 2026 3:38 PM | Updated on Mar 31 2026 4:53 PM

YSRCP Leader Dadisetti Raja Takes On Yellow Media

కాకినాడ:  ఎల్లో మీడియా అసత్య వార్తలను పదే పదే డ్రైవ్‌ చేస్తోందని వైఎస్సార్‌సీపీ నేత దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. తన వద్ద గన్‌మెన్‌గా పని చేసి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గొడవలను తనపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

తన వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన వ్యక్తి.. గత 20 నెలలుగా పవన్‌ కళ్యాణ్‌ వద్ద గన్‌మెన్‌గా చేస్తున్నారని, కానీ ఇంకా తన మాజీ గన్‌మెన్‌ అని ఎల్లోమీడియా వార్తలు రాయడంపై దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇప్పుడు ఈనాడు పత్రిక రాయాల్సింది పవన్‌ కళ్యాణ్‌ గన్‌మెన్‌ అని రాయాలని సవాల్‌ చేశారు. తనపై వార్తలు రాసిన వాళ్లు నోటికి అన్నం తింటే తన కౌంటర్‌ను కూడా ప్రచురించాలని చాలెంజ్‌ చేశారు.  ఏదో రకంగా తప్పుడు వార్తలను రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు.

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement