సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: చంద్రబాబు, ఎల్లో మీడియాకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దావోస్ పర్యటనపై ఎల్లో మీడియాది అత్యుత్సాహం అంటూ చురకలు అంటించారు. భువనగిరిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెల్లారకముందే చంద్రబాబు స్టాల్స్ వద్దకు వెళ్లాడట. అప్పటికే సెక్రటరీలు రాకపోతే ఫోన్ చేశారట. ఇంతకన్నా సిగ్గులేకుండా మాట్లాడటం ఇంకోటి ఉంటుందా?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
‘‘చీమ కూడా దూరని హోటల్‌లో బాబుకు నిద్రపట్టలేదట. బాబు సెక్రటరీలకు దుప్పట్లు ఇవ్వలేదట. ఇంతకన్నా నిస్సిగ్గు ఇంకామైనా ఉంటుందా? అంటూ జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


