
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. రిలీజ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కింగ్డమ్ మూవీ మేకర్స్ హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్కు హాజరైన కింగ్డమ్ నటుడు వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్లో నటించడం తన అదృష్టమని అన్నారు. ఎందుకంటే తనకు ఫస్ట్ క్యారవాన్ దొరికిన చిత్రం కింగ్డమ్ మాత్రమేనని వెంకటేశ్ ఆనందం వ్యక్తం చేశారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన వెంకటేశ్ కింగడమ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
వెంకటేశ్ మాట్లాడుతూ..'హలో హైదరాబాద్.. ఇలాంటి పెద్ద క్రౌడ్ను చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైమ్. నాది కేరళ.. నాపేరు వెంకటేశ్.. మలయాళ ఇండస్ట్రీలో ఒక సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి ఆ తర్వాత చిన్నపాత్రలు, తమిళ సినిమాలో హీరో.. ఈరోజు కింగ్డమ్. ఈ రోజు క్షణాలకు నాకు తొమ్మిదేళ్లు పట్టింది. ఈ జర్నీ పట్ల నాకు సంతోషంగా ఉంది. నాగవంశీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా లైఫ్లో క్యారవాన్ డోర్ దొరికిన మొదటి చిత్రం. ఇదే నాకు పెద్ద విషయం. మళ్లీ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో పనిచేయాలి. భవిష్యత్తులో హీరోగా చేయాలి' అంటూ సంతోషం వ్యక్తం చేశారు.