
టాలీవుడ్ సింగర్ మధు ప్రియ చెల్లి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఇవాళ ఆమె సిస్టర్ శృతి ప్రియ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది మధుప్రియ. తన చెల్లి పెళ్లిలో ఫుల్ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసింది సింగర్. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
కాగా.. సింగర్ మధు ప్రియ తన సిస్టర్ శృతి ప్రియ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి వేడుక వరకు తానే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంది. నిశ్చితార్థం వేడుక రోజు ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
కాాగ.. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ.. పదేళ్ల వయసులోనే ఓ స్టేజీ షోలో 'ఆడపిల్లనమ్మా' పాట పాడి ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత అంటే 2011లో 'దగ్గరగా దూరంగా' సినిమాలో 'పెద్దపులి' అనే పాటతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష‍్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడి అభిమానులను అలరించింది.