‘డేవిడ్‌ రెడ్డి’గా మంచు మనోజ్‌.. పోస్టర్‏తో అంచనాలు పెంచేశారే! | Manchu Manoj Powerful And Historical Action Drama David Reddy Announced With A Dynamic Poster Went Viral | Sakshi
Sakshi News home page

‘డేవిడ్‌ రెడ్డి’గా మంచు మనోజ్‌.. తొలిసారి అలాంటి పాత్రలో..

Aug 6 2025 11:47 AM | Updated on Aug 6 2025 12:35 PM

Manchu Manoj Powerful Historical Action Drama David Reddy Announced With A Dynamic Poster

వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్‌. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. దీనికిడేవిడ్రెడ్డిఅనే టైటిల్పెట్టినట్లు ప్రకటిస్తూ.. పోస్టర్ని విడుదల చేశారు.

హిస్టారికల్‌ యాక్షన్‌ సినిమాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. 1897 - 1922 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందనుంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అంశాలతో ఉత్కంఠభరితమైన కథతో సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో మనోజ్ మంచు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారు. బ్రిటిష్ పాలనను సవాలు చేయడానికి కుల అణచివేత నుంచి లేచిన ధైర్యవంతుడైన తిరుగుబాటు దారుడిగా కనిపించబోతున్నాడట. టైటిల్పోస్టర్తోనే సినిమాపై హైప్క్రియేట్చేశారు.

"మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, ఢిల్లీలో పెరిగాడు. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు" అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంతో పాటు ‘మిరాయ్‌’, వాట్‌ ది ఫిష్‌లోనూ మనోజ్ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement