
హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘వైబ్ ఉంది బేబీ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. తేజ సజ్జా అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.