కూతురే నా లోకం.. నా బ్యాగులో ఏముందంటే?: దీపికా | Deepika Padukone about Motherhood, thepla in her Bag | Sakshi
Sakshi News home page

Deepika Padukone: కూతురితో పాటలు.. ఐ లవ్యూ చెప్తూనే ఉన్నా..

Feb 2 2026 1:02 PM | Updated on Feb 2 2026 1:35 PM

Deepika Padukone about Motherhood, thepla in her Bag

తల్లయ్యాక ప్రతి మహిళలో ఒక మార్పు కచ్చితంగా వస్తుంది. అప్పటివరకు ఉన్న ప్రాధాన్యతలు పక్కనపెట్టి కన్నబిడ్డే సర్వస్వంగా బతుకుతుంది. ఆ బిడ్డ కంటే ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదంటుంది. అందుకు ఇండియన్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె కూడా అతీతురాలు కాదు. పాప పుట్టాక తనే ప్రపంచంగా బతికేస్తున్నానంటోంది. 

తనే నా సర్వస్వం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె మాట్లాడుతూ.. ఇప్పుడు దువా (దీపికా కూతురి పేరు)యే నా ప్రపంచం. తనకు ఆకలేస్తే తినడానికి ఏదైనా ఫుడ్‌ నా బ్యాగ్‌లో ఉంటుంది. ఈ మధ్యే తను తిని వదిలేసిన తెప్లా (ఒకరకమైన చపాతీ) ముక్క బ్యాగ్‌లో అలాగే ఉండిపోయింది. రెండు రోజుల తర్వాత దాన్ని చూసి పారేశాను. పాపకు వీలైనన్నిసార్లు ఐ లవ్యూ చెప్తూనే ఉన్నాను. తనతో హెడ్‌, షోల్డర్‌, నీస్‌, టూస్‌.. అంటూ పాటలు పాడుతున్నాను అని చెప్పుకొచ్చింది.

సినిమా
ఇక తాను హీరోయిన్‌ అవకపోయుంటే ఇంటీరియర్‌ డిజైనర్‌ అయ్యేదాన్ని అని దీపికా పేర్కొంది. అయితే తన భర్త, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మాత్రం నేను మంచి లాయర్‌ అవాల్సింది అని అంటుంటాడని తెలిపింది. దీపికా పదుకొణె- రణ్‌వీర్‌ సింగ్‌ 2018లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2024లో కూతురు దువా జన్మించింది. ప్రస్తుతం దీపికా.. కింగ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌ ఇటీవలే ధురంధర్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు.

చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement