
కరీంనగర్ నగరశివారులోని లోయర్ మానేరుడ్యాం మినీబీచ్‌ను తలపిస్తోంది. డ్యాంలో నీటిమట్టం తగ్గడంతో తిమ్మాపూర్ వైపు ఉన్న ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. వీచే గాలులకు నీటి అలలు మురిపిస్తుండగా.. మినీ బీచ్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

సెలవు రోజుల్లో ఈ ప్రాంతం జాతరను తలపిస్తోంది. సాయంత్రం పూట రద్దీ పెరుగుతుండగా.. పర్యాటకులు నీటిలో ఆడిపాడుతూ.. కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.












ఫొటోలు – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్