
పాన్ ఇండియా కథానాయకగా పేరు తెచ్చుకున్న నటి మాళవిక మోహన్. ముఖ్యంగా మలయాళం తమిళం తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఏ తరహా పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగల సత్తా కలిగిన నటి. ప్రస్తుతం ఈమె తమిళంలో కార్తీ కథానాయకుడుగా నటిస్తున్న సర్ధార్ 2 చిత్రంలోనూ, తెలుగులో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ది రాజా సాబ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా సోమవారం నటి మాళవిక మోహన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ది రాజాసాబ్ చిత్రం యూనిట్, సర్ధార్ 2 చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టల్ విడుదల చేశారు.

కాగా 32 ఏళ్లు టచ్ చేసిన మాళవిక మోహన్ మలయాళంలో మోహన్ లాల్ కు జంటగా హృదయ పూర్వం అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా మోహన్ లాల్ వయసు 64 ఏళ్లు ఆయనకు జంటగా 32 ఏళ్ల మాళవిక మోహన్ నటించడంతో సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. వాటిపై స్పందించిన మాళవిక మోహన్ నటీనటుల వయసు గురించి గానీ, వయసు వ్యత్యాసం గురించి గానీ మాట్లాడకండి అంటూ హెచ్చరించారు.
ముందు ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం ఆపేయండి అంటూ సినిమాలో ప్రతిభను చూడాలి గానీ అర్థం లేని విషయాల గురించి ఆరాలు తీయరాదనే అభిప్రాయాన్ని మాళవిక మోహన్ వ్యక్తం చేశారు.