ప్రభాస్ 'రాజాసాబ్' నాలుగున్నర గంటల ఫుటేజ్: నిర్మాత | Producer Vishwa Prasad Interesting Comments About Prabhas Rajasaab Movie Release Date | Sakshi
Sakshi News home page

Rajasaab Movie: సంక్రాంతికి రిలీజ్ చేయమంటున్నారు.. నిర్మాత కామెంట్స్

Aug 6 2025 9:03 AM | Updated on Aug 6 2025 9:11 AM

Producer Vishwa Prasad About Prabhas Rajasaab Movie Update

ఈ ఏడాదిలో రాబోయే పెద్ద సినిమాల్లో 'రాజాసాబ్' ఒకటి. ప్రభాస్ హీరో. ఈ సినిమాపై గతంలో చాలా తక్కువ అంచనాలు ఉండేవి. కానీ కొన్నిరోజుల క్రితం వచ్చిన టీజర్‪‌తో అందరి ఆలోచన మారింది. ఈ మూవీపై కూడా ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్లే డిసెంబరు 5న థియేటర్ రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఇప్పుడు అది మారే సూచనలు ఉన్నట్లు కొన్నిరోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమై నిర్మాత స్పందించారు. మూవీ సంగతుల్ని కొన్ని బయటపెట్టారు.

(ఇదీ చదవండి: రష్మీతో మనస్పర్థలు.. నిజం బయటపెట్టిన అనసూయ)

'రాజాసాబ్' సినిమా ఈ అక్టోబరు కల్లా మొత్తం రెడీ అవుతుందని.. తమ వరకు డిసెంబరు 5నే రిలీజ్ కోసం సిద్ధమవుతున్నామని, అభిమానులు, తెలుగు బయ్యర్లు మాత్రం సంక్రాంతికి రావాలని అడుగుతున్నారని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. రెండింటిలో ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. అలానే మూవీ రా ఫుటేజ్ దాదాపు నాలుగన్నర గంటల వరకు వచ్చిందని, దీన్ని 2:30 లేదా 2:45 గంటలకు కుదిస్తామని కూడా అన్నారు.

'రాజాసాబ్' చిత్రానికి రెండో భాగాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని.. కాకపోతే అది కొనసాగింపు లేదా సీక్వెల్‌లా ఉండదని, కొత్త స్టోరీతో డిఫరెంట్ యూనివర్స్ సృష్టిస్తామని నిర్మాత చెప్పారు. సినిమాలో వీఎఫ్ఎక్స్ చాలా బాగా వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. 'రాజాసాబ్' సినిమాకు మారుతి దర్శకుడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.

(ఇదీ చదవండి: 'జయం' నుంచి బన్నీని తీసేశారు.. ఆ కోపంతోనే 'గంగోత్రి': చిన్నికృష్ణ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement