
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. 'పుష్ప' రెండు సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇలాంటి నటుడికి కెరీర్ ప్రారంభం కాకముందే ఎదురుదెబ్బ తగిలిందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. స్వయానా ఈ విషయాన్ని రచయిత చిన్నికృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. గంగోత్రి, ఇంద్ర లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు కథలు అందించిన ఈయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీని జయం నుంచి తీసేయడం, 'గంగోత్రి'తో పరిచయం చేయడం లాంటి విషయాన్ని చెప్పారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. ఆ నలుగురు!)
చిన్నికృష్ణ ఏం చెప్పారంటే?
'ఓ రోజు ఉదయం నాకొక ఫోన్ వచ్చింది. అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా పరిచయమవుతున్నాడని చెప్పారు. అశ్వనీదత్ ఆఫీసులో చిన్న పార్టీ పెట్టడంతో అందరం కలిశాం. తేజ అనే డైరెక్టర్.. అల్లు అర్జున్‌ని అరంగేట్రం చేయిస్తున్నాడని చెప్పడంతో అందరూ కంగ్రాట్స్ చెప్పి ఇంటికెళ్లిపోయాం. అదే తేజ.. డిస్ట్రిబ్యూటర్ కొడుకు నితిన్ అనే అబ్బాయిని పెట్టి 'జయం' అనే సినిమా తీస్తున్నాడని ఆ తర్వాత పేపర్‌లో చూసి షాకయ్యాను. ఆ మార్పు ఎలా జరిగిందనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అల్లు అర్జున్‌తో అనుకున్న మూవీని మరో హీరోతో తీస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఫీలయ్యాం'
'మన దేశంలోని పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా చేస్తానని చెప్పి, ఆ విషయం పేపర్‌లో వచ్చిన తర్వాత తీసేయడంతో అల్లు అర్జున్ చాలా ఫీలయ్యాడు. అలా చేస్తే ఎవరైనా ఫీలవుతారు అది సహజం. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్లలో ఒకడిని కాబట్టి నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత అర్జున్ నా దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో రాఘవేంద్రరావు గారు.. తన 100వ సినిమాకు పనిచేయమని నన్ను అడుగుతున్నారు. దీంతో రజినీకాంత్ కోసం రాస్తున్న స్టోరీ ఆపేశారు. అల్లు అర్జున్‌కి వెంటనే మాటిచ్చి అల్లు అరవింద్‌కి ఫోన్ చేశా'
(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)
'365 రోజుల్లో మీ అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా సినిమా కూడా రిలీజ్ అవుతుంది, ఇది రాసిపెట్టుకోండి అని ఆయనతో చెప్పాను. అలా కథ రాసి ఇచ్చాను. అదే 'గంగోత్రి'. 175 రోజులు ఆడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కొన్ని చోట్ల 'ఇంద్ర' మూవీ కలెక్షన్ కూడా దాటేసింది' అని రైటర్ చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం మెగా, బన్నీ అభిమానుల మధ్య చర్చకు కారణమైంది.
'జయం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని బన్నీ చేజార్చుకున్నప్పటికీ.. 'గంగోత్రి'తో హిట్ కొట్టాడు. కానీ ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్స్ విషయమై అప్పట్లో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. కానీ మూవీ మూవీకి ఓవైపు యాక్టింగ్ మెరుగుపరుచుకుంటూనే మరోవైపు లుక్ కూడా మార్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ వరకు బన్నీ ఎదిగాడు. 'పుష్ప' తొలి భాగానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నాడు.
(ఇదీ చదవండి: లైఫ్ అంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు)