
'పుష్ప 2' సినిమా రిలీజై దాదాపు ఆరేడు నెలలు అయిపోయింది. దీని తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అన్న సస్పెన్స్‌కి కొన్నాళ్ల ముందు తెరదించాడు. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నారని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తుందని కూడా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌తో పాటు షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ఇప్పుడు క్రేజీ అప్‌డేట్ ఒకటి వినబడుతోంది.
(ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో మోసపోయిన యాంకర్ అనసూయ)
అల్లు అర్జున్ ఇప్పటివరకు 21 సినిమాలు చేశాడు. కానీ ఎందులోనూ ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ అట్లీ సినిమా కోసం మాత్రం ఏకంగా నాలుగు పాత్రలు పోషించనున్నాడట. అవి కూడా తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా బన్నీనే కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్ కావొచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బన్నీ ఎలా కనిపిస్తాడా అని ఎగ్జైట్‌మెంట్ గ్యారంటీ.
అట్లీ-బన్నీ సినిమాలో దీపికతోపాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్, రష్మిక కూడా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అలానే హాలీవుడ్ నటుడు విలన్‌గా కనిపించే అవకాశముందని కొన్ని రోజుల క్రితం గట్టిగా వినిపించింది. ఇలా ఎప్పటికప్పుడు ఏదో గాసిప్ వినిపిస్తూనే ఉంది. అలా ట్రెండ్ అవుతూనే ఉంది. మరి వీటిలో ఎన్ని నిజం ఎన్ని అబద్ధం అనేది కొన్నిరోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు. అప్పటివరకు బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.
(ఇదీ చదవండి: భార్యకు సీమంతం చేసిన తెలుగు కమెడియన్)