
యూట్యూబర్‌గా ఫేమ్ తెచ్చుకుని ఆపై సినిమాలు చేసిన కమెడియన్ మహేశ్ విట్టా.. గత నెలలో గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేశాడు. ఇది జరిగి ఎన్ని రోజులు కాలేదు ఇప్పుడు ఆమెకు సీమంతం చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.
(ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో మోసపోయిన యాంకర్ అనసూయ)
రాయలసీమ కుర్రాడిగా యూట్యూబ్ వీడియోలు చేసిన మహేశ్ విట్టా.. తర్వాత నటుడిగా పలు మూవీస్ చేశాడు. బిగ్‌బాస్ షోకి కూడా రెండుసార్లు వెళ్లొచ్చాడు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తూ, మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్‌బాస్ హౌసులో ఉండగానే తన ప్రేమ గురించి బయటపెట్టిన మహేశ్.. త్వరలో పెళ్లి ఉండొచ్చని చెప్పాడు. అన్నట్లుగానే 2023 సెప్టెంబరులో శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించాడు.
మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండే శ్రావణి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్నారు. మహేశ్ విట్టా సినీ కెరీర్ విషయానికొస్తే.. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. నిజానికి 'పుష్ప' మూవీలో కేశవ పాత్ర కోసం కూడా ఆడిషన్ ఇచ్చాడు. కానీ చివరి నిమిషంలో మహేశ్ విట్టా బదులు జగదీశ్ ప్రతాప్‌కి అవకాశం దక్కింది.
(ఇదీ చదవండి: వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకు: రజినీకాంత్)