
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవాళ్లలో యాంకర్ అనసూయ ఒకరు. గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేయడంతో పాటు ట్రెండింగ్ టాపిక్స్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈమె కూడా ఆన్‌లైన్‌లో మోసానికి గురైంది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తన దగ్గర డబ్బులు తీసుకుని, ఇప్పటికీ సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ అసలేం జరిగింది?
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. మరీ ముఖ్యంగా బట్టల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అనసూయ కూడా ఇలానే నెల క్రితం ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. కానీ ఇప్పటికీ సదరు వస్తువులు రాలేదని, అదే టైంలో రీఫండ్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకు: రజినీకాంత్)
సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అప్పనంగా డబ్బులు కొట్టేస్తున్నారని సదరు క్లాతింగ్ వెబ్‌సైట్‌పై అనసూయ మండిపడింది. ఈమెకే కాదు గత కొన్నాళ్లుగా ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురువుతున్నాయి. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు అనసూయ కూడా అదే పనిచేసింది. మరి సదరు క్లాతింగ్ బ్రాండ్ స్పందిస్తుందో లేదో చూడాలి?
ప్రస్తుతం అనసూయ.. రెండు తమిళ సినిమాలు చేస్తున్నట్లు ఉంది. అలానే ఒకటి రెండు తెలుగు రియాలిటీ షోల్లోనూ జడ్జిగా వ్యవహరిస్తోంది. చివరగా 'పుష్ప 2'లో దాక్షాయణిగా కనిపించింది. ఈనెల 24న రిలీజయ్యే 'హరిహర వీరమల్లు' చిత్రంలోనూ అనసూయ నటించింది.
(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?)
