
ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే అప్పుడప్పుడు వాళ్లపై వాళ్లే సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పుడు అలానే చేశారు. తమిళ రచయిత ఎస్.వెంకటేశన్ రచించిన 'వేల్పరి' పుస్తకానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్‌తోపాటు రజినీ కూడా హాజరయ్యారు. తనపై తాను జోక్స్ వేసుకుని కాసేపు అందరినీ నవ్వించారు.
'ఏం మాట్లాడాలి అనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడలనేది స్టేజీపై ఆధారపడి ఉంటుంది. అలానే ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్లని పిలవాల్సింది. ఎందుకంటే వాళ్లు ఎంతో మేధావులు'
(ఇదీ చదవండి: అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్‌తో నటి డేటింగ్)
''వేల్పరి' కార్యక్రమానికి అతిథిగా నన్ను ఆహ్వానించినప్పుడు 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్‌లో నటిచే నన్నెందుకు పిలిచారా? అని ఆశ్చర్యపోయాను' అని రజినీకాంత్ తనపై తాను జోకులు వేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటిహీరో కమల్ తనకంటే మేధావి అని రజినీ చెప్పడం విశేషం.
రజినీకాంత్ ప్రస్తుతం 'కూలీ' సినిమా చేశాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. మూవీపై అయితే హైప్ గట్టిగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత రజినీకాంత్.. ఏ డైరెక్టర్‌తో పనిచేస్తారా అనేది ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉంది.
(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?)
He is 75 now Best orator when comes to stage speeches . The way he kept audience engaging 🔥🔥🔥
Ultimate hilarious fun mode 😂😂
Mr . Rajinikanth 😂
Kamalhaasan elevation 🔥
Sivakumar ayya elevation 🔥
Dmk function 😂😂
Cooling glass slow motion 😂
Why I’m chief for this… pic.twitter.com/plbtMjBLQO— Suresh balaji (@surbalutwt) July 11, 2025