
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటింగ్, పెళ్లి విషయంలో యువత ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. కొందరు అసలు పెళ్లి చేసుకోవడానికే భయపడుతుంటే.. మరికొందరు అబ్బాయిలు మాత్రం తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి వరకు వెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇలానే అఖిల్.. తన కంటే పెద్దదైన జైనబ్‌ని పెళ్లి చేసుకున్నాడు! ఇప్పుడు ప్రముఖ నటి కూడా తన కంటే చిన్నవాడైన ఓ యూట్యూబర్‌తో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇద్దరూ ప్రకటించారు కూడా!
(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?)
యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్‌తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఎక్కడా కూడా తన బంధం గురించి చెప్పలేదు కానీ ఆశిష్-ఎల్లీ డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఈమె వయసు 34 ఏళ్లు కాగా, ఆశిక్‌కి 31 ఏళ్లు. మరి వీళ్లు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి?
(ఇదీ చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?)