
నటి రేణు దేశాయ్ (Renu Desai) మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తను పోస్ట్ చేసిన ఫోటోనే అందుకు కారణం. కూతురు ఆద్యతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన రేణు.. సెల్ఫీకి పోజిచ్చింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సర్జరీ తర్వాత నా క్యూటీతో కలిసి డిన్నర్‌కు వెళ్లాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు రేణు దేశాయ్‌కు ఏమైందని కంగారుపడుతున్నారు. అయితే నటి మాత్రం తనకు ఏ సర్జరీ జరిగింది? ఎన్నిరోజులు ఆస్పత్రిలో ఉంది? వంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు.
సినిమా.. రీఎంట్రీ
రేణు దేశాయ్.. తెలుగులో బద్రి, జానీ సినిమాలు చేసింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం రేణు.. సినిమాలకు దూరమైంది. ఈ జంటకు కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్య సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల రెండు సినిమాలకు సంతకం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

చదవండి: మూడు రోజుల్లో బిగ్‌బాస్ బ్యూటీ బర్త్‌డే.. లక్ష రూపాయలతో