breaking news
Elli AvrRam
-
నటిపై దారుణ ట్రోల్స్.. మహిళలంటే ఎందుకంత ద్వేషం.. ఉర్ఫీ జావెద్ ఆగ్రహం!
బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ది ట్రైటర్స్ టైటిల్ గెలిచిన ముద్దుగుమ్మ నెటిజన్స్ ట్రోల్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటివీ నా జీవితంలో చాలా చూశానని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఒక మహిళ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచలానీతో ప్రేమలో ఉన్నట్లు నటి ఎల్లీ అవ్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఈ జంటపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.ఈ ప్రేమజంటను చూసి ట్రోల్స్ చేయడంపై నటి ఉర్ఫీ జావెద్ మండిపడింది. ఎల్లి అవ్రామ్ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేసినందుకు ఉర్ఫీ జావేద్ విమర్శించింది. ఈ రోజుల్లో స్త్రీలపై విద్వేషం చూపించడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇది చూస్తుంటే మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతోందని చెప్పింది. కేవలం ఒక అమ్మాయి వయసును ఉద్దేశించి కామెంట్స్ చేయడమేంటని ఉర్ఫీ ప్రశ్నించింది. ఇక్కడ మహిళలను విలన్‌గా చూపించడానికి, ద్వేషించడానికే ఎక్కువ ఇష్టపడతారని.. అదే వారు ఉన్నతంగా భావిస్తారని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం ఎల్లప్పుడూ మహిళలను విమర్శించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా.. జూలై 12న, ఆశిశ్, ఎల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆశిష్ ఎల్లీని తన చేతుల్లోకి ఎత్తుకుని కనిపించారు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఫైనల్లీ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి వయస్సును ఉద్దేశిస్తూ ట్రోల్స్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.మరోవైపు ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. -
అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్‌తో నటి డేటింగ్
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటింగ్, పెళ్లి విషయంలో యువత ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. కొందరు అసలు పెళ్లి చేసుకోవడానికే భయపడుతుంటే.. మరికొందరు అబ్బాయిలు మాత్రం తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి వరకు వెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇలానే అఖిల్.. తన కంటే పెద్దదైన జైనబ్‌ని పెళ్లి చేసుకున్నాడు! ఇప్పుడు ప్రముఖ నటి కూడా తన కంటే చిన్నవాడైన ఓ యూట్యూబర్‌తో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇద్దరూ ప్రకటించారు కూడా!(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.ఎక్కడా కూడా తన బంధం గురించి చెప్పలేదు కానీ ఆశిష్-ఎల్లీ డేటింగ్లో ఉన్నారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఈమె వయసు 34 ఏళ్లు కాగా, ఆశిక్కి 31 ఏళ్లు. మరి వీళ్లు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి?(ఇదీ చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?) View this post on Instagram A post shared by Ashish Chanchlani (@ashishchanchlani) -
‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’
సాక్షి, ముంబై: చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పెను దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్కో నటి సమయం వచ్చినప్పుడు దీనిపై స్వరం వినిపిస్తూనే ఉన్నారు. దీనిపై చర్చ ఈ మధ్య కొంత తగ్గినట్లు కనిపించినా.. తాజాగా ఓ బాలీవుడ్ నటి చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి నోరు విప్పారు. సినిమాలో అవకాశం కోసం వస్తే ఇద్దరు దర్శకులు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని బాలీవుడ్ నటి ఎల్లి అవ్రామ్ అన్నారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. బాలీవుడ్లో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. స్వీడన్‌కు చెందిన తనకు అక్కడ అవకాశాలు లభించకపోవడంతో అవకాశాలు వెతుక్కుంటూ.. బాలీవుడ్‌కు వచ్చినట్లు తెలిపారు. అయితే కథ నిమిత్తం ఓ దర్శకుడికి దగ్గరకు వెళ్లితే తాను చాలా పొట్టిగా ఉన్నానని, ముందు పళ్లు బాగోలేవని తొలుత హేళన చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ తరువాత తన చేయి పట్టుకుని గోరుతో గిల్లినట్లు తెలిపింది. అయితే ఇవేవీ తనకు తెలియకపోవడంతో తేలిగ్గా తీసుకున్న ఎల్లి కొంత కాలం తరువాత తన స్నేహితురాలిని కలిసింది. ఈ విషయం తన వద్ద ప్రస్తావించగా.. ఆమె అసలు విషయం వివరించింది. గోరుతో చేయిపై గోకితే ఒక రాత్రి తనతో గడపమని అర్థం అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని ఎల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మరో దర్శకుడు కూడా తనతో ఇలానే ప్రవర్తించినట్లు గుర్తుచేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్లో అవకాశాలు రావడం చాలా కష్టమన్నది. షూటింగ్ సమయంలో ఇలాంటి వేధింపులు తాను చాలా ఎదుర్కొన్నట్లు చెప్పింది. -
మరో భామతో హార్దిక్ డేటింగ్?
ముంబై: ఇటీవల కాలంలో భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక్కడ ఆట కంటే కూడా డేటింగ్ వ్యవహారాల పరంగానే హార్దిక్ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. నిన్నటిదాకా బాలీవుడ్ బ్యూటీ ఎల్లీ అవ్రాన్తో ‘ప్రేమాయణం’ సాగించిన హార్దిక్.. ఇప్పుడు ఇషా గుప్తా అనే నటికి దగ్గరయ్యాడట! వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన ఇషాతో కలిసి పాండ్యా.. రెస్టారెంట్లు, పార్టీలు, ఈవెంట్లకు హాజరవుతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. గతేడాది డిసెంబరు నుంచి డేటింగ్లో ఉన్న ఎల్లీతో రెండువారాల క్రితమే పాండ్యా విడిపోయాడని అతని సన్నిహితులు తెలిపారు. ఒకవేళ ఇషాతో డేటింగ్ నిజమైతే అది ఎంతకాలం ఉంటుందో చూడాలి. -
ఆమెతో పాండ్యా బ్రేకప్.. ఈమెతో షికార్లు..!
ముంబై : క్రికెటర్లు, హీరోయిన్ల బంధం తరతరాలుగా కొనసాగుతోంది. గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు ఇదే కోవకు చెందుతారు. అయితే ఇటీవల నటి నిధి అగర్వాల్- క్రికెటర్ కేఎల్ రాహుల్‌లపై వదంతులు రాగా, తాము కేవలం స్నేహితులమేనని.. ఎప్పటినుంచో తమకు పరిచయం ఉందని వారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్వీడన్ మోడల్-నటి ఎల్లీ అవ్రామ్ జోడీ బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హార్ధిక్ అన్నయ్య, క్రికెటర్ కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ హాజరైనప్పటి నుంచి వీరి డేటింగ్ రిలేషన్ అందరికీ తెలిసింది. అయితే వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ‘హేట్ స్టోరీ 4’ నటి ఊర్వశి రౌతెలా. పారిశ్రామికవేత్త గౌతం సింఘానియా పార్టీలో హార్ధిక్ పాండ్యా, ఊర్వశి కలుసుకున్నారు. అప్పటినుంచీ వీరి రిలేషన్ మొదలుకావడంతో ఎల్లీ అవ్రామ్, పాండ్యా నుంచి దూరంగా ఉందంటూ ఊహాగానాలున్నాయి. ఐపీఎల్-11 సమయంలో హార్ధిక్-ఊర్వశి రౌతెలా ఫొటోలు నెట్లో దర్శనమిచ్చాయి. గతంలో ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి వెళ్లినప్పుడు కెమెరా కంటికి చిక్కగా.. ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే బ్రేకప్ వదంతులపై హార్ధిక్ పాండ్యాగానీ, ఎల్లీ అవ్రామ్ స్పందించలేదు. -
నటితో పాండ్యా డేటింగ్.. ఫొటోలు వైరల్!
ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్వీడన్ మోడల్ ఎల్లీ అవ్రామ్తో డేటింగ్లో ఉన్నట్లు మరోసారి రుజువైంది. గత కొంతకాలం నుంచి, ముఖ్యంగా హార్ధిక్ అన్నయ్య, క్రికెటర్ కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ హాజరైనప్పటి నుంచి వీరి డేటింగ్ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కృనాల్ పెళ్లి వేడుకలో హార్ధిక్, తన ప్రేయసి ఎల్లీ అవ్రామ్తో కలిసి ఫొటోలు దిగగా అప్పట్లో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి ఎల్లీతో కలిసి హార్ధిక్ ఎయిర్‌పోర్టులో కనిపించాడు. ప్రూఫ్ దొరికింది.. ఎల్లీ, పాండ్యా డేటింగ్లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి బాయ్.. బాయ్ చెప్పేసినట్లు ఫొటోలు చూస్తే తెలుస్తోంది. అయితే మీడియాతో సహా కొందరు ఈ క్రికెట్ అభిమానులు వీరి వాహనం వద్దకు రాగానే ఎల్లీ అవ్రామ్ జట్టుతో ముఖాన్ని కప్పిఉంచే ప్రయత్నం చేయడం కెమెరా కంట పడింది. హార్ధిక్ మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా లగేజీ బ్యాగ్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య ప్రారంభంకానున్న ముక్కోణపు టోర్నీ నుంచి పాండ్యాకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. -
పాండ్యాతో డేటింగ్‌పై ఎల్లీ ఏమందంటే..?
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా ప్లేయర్ హార్థిక్ పాండ్యాతో సన్నిహితంగా ఉంటుందనే రూమర్లతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్ భామ ఎల్లీ ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మౌనం వీడింది. హార్థిక్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వదంతులను ప్రస్తావిస్తూ ఏ విషయాన్నీ స్పష్టం చేయకుండా తెలివిగా దాటవేసింది. హార్థిక్ పాండ్యాతో తాను సన్నిహితంగా ఉంటానన్న రూమర్లపై తానేం మాట్లాడినా ఎవరూ నమ్మరని, దీనిపై తాను ఏదో దాస్తున్నాననే వారు భావిస్తారని అసలు విషయం చెప్పకుండా తెలివిగా వ్యవహరించింది. వీటిపై తాను మాట్లాడితే వదంతులకు మరింత ఊతం ఇచ్చినట్టే అవుతుందని.. దీనిపై తానెందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది. గత కొన్నేళ్లుగా ఎన్నో తప్పుడు విషయాలు రాస్తున్నా తాను ముందుకొచ్చి స్పష్టత ఇచ్చింది లేదని పేర్కొంది. తన వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడదలుచుకోలేదని.. తానేం చెప్పినా తనను ప్రజలు విశ్వసించరని పేర్కొంది. తాను తన కుటుంబానికి మాత్రమే జవాబుదారీగా ఉంటానని తేల్చిచెప్పింది. -
స్వీడన్ భామతో డేటింగ్..!
ముంబై : భారత క్రెకిట్ ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా స్వీడన్ భామ ఎల్లీతో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ కోడైకూస్తోంది. ఎలిసాబెట్ అవ్రామిడో గ్రాన్‌లండ్ ‘మిక్కీ వైరస్’ సినిమాతో 2013లో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్న ఇరువురూ హర్ధిక్ అన్నయ్య కృనాల్ పెళ్లి వేదికపై తళుక్కున మెరిశారు. పరిణితి చోప్రాతో హర్ధిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, డేటింగ్ రూమర్లపై హర్ధిక్, ఎల్లీల్లో ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. కృనాల్ పాండ్యా పెళ్లిలో హర్ధిక్, ఎల్లీ