పాండ్యాతో డేటింగ్‌పై ఎల్లీ ఏమందంటే..? | Elli AvrRam-Hardik Pandya dating each other | Sakshi
Sakshi News home page

పాండ్యాతో డేటింగ్‌పై ఎల్లీ ఏమందంటే..?

Feb 12 2018 7:59 PM | Updated on Feb 12 2018 8:15 PM

Elli AvrRam-Hardik Pandya dating each other - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా ప్లేయర్‌ హార్థిక్‌ పాండ్యాతో సన్నిహితంగా ఉంటుందనే రూమర్లతో వార్తల్లో నిలిచిన బాలీవుడ్‌ భామ ఎల్లీ ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మౌనం వీడింది. హార్థిక్‌తో తాను డేటింగ్‌ చేస్తున్నట్టు వచ్చిన వదంతులను ప్రస్తావిస్తూ ఏ విషయాన్నీ స్పష్టం చేయకుండా తెలివిగా దాటవేసింది. హార్థిక్‌ పాండ్యాతో తాను సన్నిహితంగా ఉంటానన్న రూమర్లపై తానేం మాట్లాడినా ఎవరూ నమ్మరని, దీనిపై తాను ఏదో దాస్తున్నాననే వారు భావిస్తారని అసలు విషయం చెప్పకుండా తెలివిగా వ్యవహరించింది. వీటిపై తాను మాట్లాడితే వదంతులకు మరింత ఊతం ఇచ్చినట్టే అవుతుందని.. దీనిపై తానెందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించింది.

గత కొన్నేళ్లుగా ఎన్నో తప్పుడు విషయాలు రాస్తున్నా తాను ముందుకొచ్చి స్పష్టత ఇచ్చింది లేదని పేర్కొంది. తన వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడదలుచుకోలేదని.. తానేం చెప్పినా తనను ప్రజలు విశ్వసించరని పేర్కొంది. తాను తన కుటుంబానికి మాత్రమే జవాబుదారీగా ఉంటానని తేల్చిచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement