టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా.. మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపాడు.
ఆసియాకప్-2025లో గాయపడిన తర్వాత పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. తన పునరాగమనంలో పాండ్యా బంతితో రాణించలేకపోయినప్పటికి బ్యాట్‌తో మాత్రం విధ్వంసం సృష్టించాడు. 225పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను హార్దిక్ ఉతికారేశాడు.
తన ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలపెట్టినప్పటికి.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 183.33గా ఉంది. అతడితో పాటు విష్ణు సోలంకి(43), శివాలిక్ శర్మ(47) మెరుపులు మెరిపించారు.
225 పరుగుల లక్ష్యాన్ని బరోడా కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులిచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. పాండ్యా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ టీ20 సిరీస్‌కు ముందు హార్దిక్ మరో రెండు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నాడు.
చదవండి: IND vs SA: అతడిపై మీకు నమ్మకం లేదా? మరెందుకు సెలెక్ట్ చేశారు?
Hardik Pandya is back with a bang. smashed 77 not out and won the game for Baroda against Punjab.#SMAT2025 #HardikPandya pic.twitter.com/KmmVpawkgQ
— The last dance (@26lastdance) December 2, 2025


