నటితో పాండ్యా డేటింగ్.. ఫొటోలు వైరల్! | Hardik Pandya And Actress Elli AvrRam Seen At Airport | Sakshi
Sakshi News home page

నటితో పాండ్యా డేటింగ్.. ఫొటోలు వైరల్!

Mar 5 2018 9:25 PM | Updated on Mar 5 2018 9:34 PM

Hardik Pandya And Actress Elli AvrRam Seen At Airport - Sakshi

ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్వీడన్ మోడల్ ఎల్లీ అవ్రామ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు మరోసారి రుజువైంది. గత కొంతకాలం నుంచి, ముఖ్యంగా హార్ధిక్ అన్నయ్య, క్రికెటర్ కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ హాజరైనప్పటి నుంచి వీరి డేటింగ్ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కృనాల్ పెళ్లి వేడుకలో హార్ధిక్, తన ప్రేయసి ఎల్లీ అవ్రామ్‌తో కలిసి ఫొటోలు దిగగా అప్పట్లో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి ఎల్లీతో కలిసి హార్ధిక్ ఎయిర్‌పోర్టులో కనిపించాడు. ప్రూఫ్ దొరికింది.. ఎల్లీ, పాండ్యా డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి బాయ్.. బాయ్ చెప్పేసినట్లు ఫొటోలు చూస్తే తెలుస్తోంది. అయితే మీడియాతో సహా కొందరు ఈ క్రికెట్ అభిమానులు వీరి వాహనం వద్దకు రాగానే ఎల్లీ అవ్రామ్ జట్టుతో ముఖాన్ని కప్పిఉంచే ప్రయత్నం చేయడం కెమెరా కంట పడింది. హార్ధిక్ మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా లగేజీ బ్యాగ్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య ప్రారంభంకానున్న ముక్కోణపు టోర్నీ నుంచి పాండ్యాకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement