సౌదీలో దమామ్‌ విమానాశ్రయంపై దాడి..భారతీయుడి దుర్మరణం | One Indian Killed, Two Injured in Attack On Dammam Airport | Sakshi
Sakshi News home page

సౌదీలో దమామ్‌ విమానాశ్రయంపై దాడి..భారతీయుడి దుర్మరణం

Oct 23 2026 2:19 AM | Updated on Oct 23 2026 2:19 AM

One Indian Killed, Two Injured in Attack On Dammam Airport

ఇద్దరు భారతీయులు సహా ఎనిమిది మందికి గాయాలు 

శాయాబ్‌ చమురు క్షేత్రంపై దాడిలో మరో భారతీయుడికి గాయాలు

దుబాయ్‌: సౌదీ అరేబియాలోని దమామ్‌ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడుసహా ఇద్దరు మరణించగా, ఇద్దరు భారతీయులతోపాటు మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. శాయబా చమురుక్షేత్రంపై డ్రోన్‌ దాడిలో భారతీయుడు ఒకరు గాయపడిన ఘటన గడిచి 24 గంటలు కూడా కాకుండానే తాజా దాడి జరగడం గమనార్హం. 

సౌదీ అరేబియాలోని పలు చమురు క్షేత్రాలు, కీలకమైన మౌలిక సదుపాయాలపై యమెన్‌కు చెంది హౌతీ తిరుగుబాటుదారులు వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. దమామ్‌ విమానాశ్రయంపై జరగిన దాడి గురించి సౌదీ అరేబియో అధికారులు తమకు బుధవారం రాత్రి తెలియజేశారని, ఈ ఘటనలో భారత్, సౌదీ అరేబియాలకు చెందిన ఇద్దరు మరణించారని, గాయపడ్డ ఎనిమిది మందిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు రియాద్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. అయితే ఈ దాడి డ్రోన్‌ ద్వారా జరిగిందా? లేక క్షిపణి ద్వారానా అన్నది తెలియరాలేదు.

 అంతేకాకుండా ఈ దాడులకు బాధ్యులు ఎవరన్నది కూడా స్పష్టం కాలేదు. బాధితులను గుర్తించి వారి కుటుంబాలకు సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. సౌదీ అరేబియా పౌర విమానయాన శాఖ ఒక ప్రకటన చేస్తూ ఈ ఘటనలో భారత్, యమెన్, బంగ్లాదేశలకు చెందిన ఆరుగురు, సౌదీ, నేపాల్‌లకు చెందిన ఇద్దరు గాయపడ్డారని, వీరందరూ ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. దాడి ఘటన తరువాత విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని, రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని చెప్పారు. 

ఖండించిన భారత్‌ 
దమామ్‌ విమానాశ్రయంపై జరిగిన దాడిలో భారతీయుడి మరణం, ఇద్దరు గాయపడటంపై భారత్‌ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. దాడులను తీవ్రంగా ఖండించింది. పౌరులు, మౌలిక సదుపాయాలు లక్ష్యంగా జరుగుతున్న దాడులు వెంటనే నిలిపివేయాలని, కాల్పుల విరమణ జరగాలని స్పష్టం చేసింది. దాడుల్లో మరణించిన, భారతీయుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాల్లోనూ సౌదీ అరేబియా ప్రభుత్వానికి, ప్రజలు మద్దతుగా నిలుస్తున్నట్లు స్పష్టం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement