న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్త అభిజీత్ దీప్కేకు ఢిల్లీ విమానాశ్రయంలో కొందరి నుంచి నిరసన ఎదురైంది. దేశాన్ని ఎందుకు చెడగొడుతున్నావంటూ వారు ఆయనను ప్రశ్నించారు. మరి కొందరు ‘దొంగ.. దొంగ’ అంటూ నినాదాలు చేసినట్లు వీడియోలో వినిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే, దీప్కేను ప్రశ్నించిన వ్యక్తులు ఎవరన్నది స్పష్టంగా తెలియరాలేదు.
సీజేపీ కార్యకర్తలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా, అజింక్య షిండేలను ఢిల్లీ పోలీసులు నిర్బంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం జంతర్మంతర్లోకి ప్రవేశించేందుకు సీజేపీ కార్యకర్తలు బారికేడ్లు దాటి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. జంతర్మంతర్ ప్రస్తుతం అధికారికంగా నిరసనలకు అనుమతించిన ప్రదేశం కాదని, అక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలకూ అనుమతి లేదని పేర్కొన్నారు.
CNN News18 Mega Exclusive: A tense and chaotic situation unfolded at Delhi’s Indira Gandhi International (IGI) Airport as activist and Cockroach Janta Party (CJP) founder Abhijeet Dipke was allegedly abused by fellow passengers over his protest actions. Passengers voiced strong opposition, questioning and hooting at him over the disruptions and the inconvenience caused to ordinary travellers. A video accessed by CNN News18 shows Dipke being escorted through the airport terminal amid heavy security and a large gathering. Security personnel and police intervened to protect him from the crowd as bystanders openly voiced their displeasure, reflecting public frustration with his political tactics. #AbhijeetDipke #CJPProtest #DelhiAirport
— News18 (@CNNnews18) October 14, 2026
ఈ పరిణామాల మధ్య అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని కనాట్ ప్లేస్ సెంట్రల్ పార్కులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో ‘తిరంగా లహరా దో’ అని పేర్కొన్నారు. దేశభక్తులు, జాతీయ జెండాను ప్రేమించే వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకే జైలులో పెట్టారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.
జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అని, దానిని ఎగురవేయడం నేరం కాదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీకి రాలేని వారు తమ తమ నగరాల్లో సాయంత్రం త్రివర్ణ పతాక ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన తనకు లేదని, త్రివర్ణ పతాకాన్ని తప్పకుండా ఎగురవేస్తానని దీప్కే స్పష్టం చేశారు. సీజేపీ కార్యకర్తల నిర్బంధం, అనంతరం దీప్కే ఇచ్చిన పిలుపుతో ఢిల్లీలో జాతీయ జెండా ఆవిష్కరణ, నిరసనల అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చదవండి: అంకితా హత్య కేసు: తెల్లవారుజామున ఢిల్లీలో హైడ్రామా


