నటిపై దారుణ ట్రోల్స్‌.. మహిళలంటే ఎందుకంత ద్వేషం.. ఉర్ఫీ జావెద్ ఆగ్రహం! | Uorfi Javed hits out at trolls warning Ashish Chanchlani about Elli AvrRam | Sakshi
Sakshi News home page

Uorfi Javed: 'మహిళను ద్వేషించడం గొప్పగా ఫీలవుతారు'.. ట్రోలర్స్‌పై ఉర్ఫీ జావెద్‌ ఆగ్రహం!

Jul 15 2025 9:46 PM | Updated on Jul 15 2025 10:01 PM

Uorfi Javed hits out at trolls warning Ashish Chanchlani about Elli AvrRam

బిగ్బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ది ట్రైటర్స్ టైటిల్ గెలిచిన ముద్దుగుమ్మ నెటిజన్స్ట్రోల్స్పై తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటివీ నా జీవితంలో చాలా చూశానని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఒక మహిళ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచలానీతో ప్రేమలో ఉన్నట్లు నటి ఎల్లీ అవ్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ జంటపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.

ప్రేమజంటను చూసి ట్రోల్స్ చేయడంపై నటి ఉర్ఫీ జావెద్ మండిపడింది. ఎల్లి అవ్రామ్ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేసినందుకు ఉర్ఫీ జావేద్ విమర్శించింది. రోజుల్లో స్త్రీలపై విద్వేషం చూపించడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇది చూస్తుంటే మహిళల పట్ల ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతోందని చెప్పింది. కేవలం ఒక అమ్మాయి వయసును ఉద్దేశించి కామెంట్స్ చేయడమేంటని ఉర్ఫీ ప్రశ్నించింది. ఇక్కడ మహిళలను విలన్‌గా చూపించడానికి, ద్వేషించడానికే ఎక్కువ ఇష్టపడతారని.. అదే వారు ఉన్నతంగా భావిస్తారని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం ఎల్లప్పుడూ మహిళలను విమర్శించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా.. జూలై 12న, ఆశిశ్, ఎల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆశిష్ ఎల్లీని తన చేతుల్లోకి ఎత్తుకుని కనిపించారు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఫైనల్లీ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి వయస్సును ద్దేశిస్తూ ట్రోల్స్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్‌తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

మరోవైపు ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement