breaking news
Ashish Chanchlani
-
రాజమౌళి బిగ్ ఈవెంట్.. హోస్ట్‌గా ప్రముఖ యూట్యూబర్!
మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఎస్ఎస్ఎంబీ29. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు మన దర్శకధీరుడు. ఓ సాంగ్‌ను రిలీజ్ చేయడంతో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అయితే ఈ మూవీ టైటిల్‌పై ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. టైటిల్ ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా? అని మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకలో భాగంగా మూవీ టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నారు. దీంతో భారీగా ఫ్యాన్స్ రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కొన్ని సూచనలు ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈవెంట్ పాస్‌లు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: మహేష్ బాబు సినిమా ఈవెంట్.. వాళ్లకు నో ఎంట్రీ: రాజమౌళి)అయితే తాజాగా ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్ ఈవెంట్‌కు హోస్ట్ ఎవరన్నది కూడా టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు మన స్టార్ యాంకర్ సుమ ఉండనే ఉంటుంది. సుమతో పాటు ప్రముఖ యూట్యూబర్ ఈ మెగా ఈవెంట్‌కు హోస్ట్‌గా పనిచేయనున్నారు. బాలీవుడ్‌కు చెందిన ఆశిష్ చంచలానీ హోస్ట్‌గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఓ ఫన్నీ వీడియో ద్వారా మేకర్స్ రివీల్ చేశారు. రాజమౌళితో కలిసి ఈ వీడియోను రూపొందించారు.కాగా.. తొలిసారి రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు గ్లోబ్ ట్రాటర్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ బిగ్ ఈవెంట్లో ఈ విషయాన్ని రివీల్ చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దాదాపు 50 వేల మందికి పైగా అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15న సాయంత్రం 7 గంటలకు జియోహాట్‌స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. So here we go…⁰@ashchanchlani will host @thetrilight presents the #GlobeTrotterEvent 🔥November 15th - gear up for an exhilarating day of something spectacular.#GlobeTrotterEvent @ssrajamouli @urstrulyMahesh @priyankachopra @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts… pic.twitter.com/RElWGR9uiJ— Sri Durga Arts (@SriDurgaArts) November 13, 2025 -
నటిపై దారుణ ట్రోల్స్.. మహిళలంటే ఎందుకంత ద్వేషం.. ఉర్ఫీ జావెద్ ఆగ్రహం!
బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ది ట్రైటర్స్ టైటిల్ గెలిచిన ముద్దుగుమ్మ నెటిజన్స్ ట్రోల్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటివీ నా జీవితంలో చాలా చూశానని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఒక మహిళ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచలానీతో ప్రేమలో ఉన్నట్లు నటి ఎల్లీ అవ్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ ఈ జంటపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.ఈ ప్రేమజంటను చూసి ట్రోల్స్ చేయడంపై నటి ఉర్ఫీ జావెద్ మండిపడింది. ఎల్లి అవ్రామ్ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేసినందుకు ఉర్ఫీ జావేద్ విమర్శించింది. ఈ రోజుల్లో స్త్రీలపై విద్వేషం చూపించడం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఇది చూస్తుంటే మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతోందని చెప్పింది. కేవలం ఒక అమ్మాయి వయసును ఉద్దేశించి కామెంట్స్ చేయడమేంటని ఉర్ఫీ ప్రశ్నించింది. ఇక్కడ మహిళలను విలన్‌గా చూపించడానికి, ద్వేషించడానికే ఎక్కువ ఇష్టపడతారని.. అదే వారు ఉన్నతంగా భావిస్తారని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం ఎల్లప్పుడూ మహిళలను విమర్శించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా.. జూలై 12న, ఆశిశ్, ఎల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆశిష్ ఎల్లీని తన చేతుల్లోకి ఎత్తుకుని కనిపించారు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు ఫైనల్లీ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరి వయస్సును ఉద్దేశిస్తూ ట్రోల్స్ చేశారు. అయితే వీరిద్దరి మధ్య మూడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.మరోవైపు ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.


