ఇటీవలి కాలంలో విడాకుల సంఖ్య పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి దూరడం వల్లే ఈ విడాకులు ఎక్కువవుతున్నాయి. తమ విడాకుల వ్యవహారానికి కూడా మూడో మనిషే (సింగర్ కెనీషా ఫ్రాన్సిస్) కారణమని తీవ్రమైన ఆరోపణలు చేసింది ఆర్తి. తమిళ స్టార్ జంట రవి మోహన్- ఆర్తి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో కనసాగుతోంది.
పురుషులే అసలైన బాధితులు
ఇదిలా ఉంటే రవి ఇటీవల ఓ పోస్ట్ పెట్టాడు. అందులో మహిళలే కరెక్ట్ అని అందరూ అనుకుంటారు, కానీ పురుషులే అసలైన బాధితులు. అది మన న్యాయవ్యవస్థకు కూడా అర్థమవుతోంది. నేను ప్రేమించినవారికోసం ఏం చేశాను? నా మనసేంటి? అనేది ఏదో ఒకరోజు మీక్కూడా అర్థమవుతుంది. దయచేసి ప్రశాంతంగా బతకనివ్వండి.. మీ వికారమైన ఆలోచనలను మీదగ్గరే ఉంచుకోండి అని రాసుకొచ్చాడు.
పిల్లల్ని ఎవరు పెంచారు?
అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కరుత్తు కన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు మంజూరవకముందే మరో అమ్మాయితో తిరుగుతున్న ఈయన సుద్దపూసలా మాట్లాడుతున్నాడు. ఇంతకూ పిల్లల్ని నువ్వే పెంచావా? లేదా ఆ బాధ్యతను ఆర్తిపై వేశావా? న్యాయవ్యవస్థ గురించి మాట్లాడేముందు పిల్లల్ని ఎవరు పెంచారో చెప్పు.. భరణం గురించి కాదు!
ఎందుకీ దొంగ ఏడుపు?
నువ్వేమో మరో అమ్మాయితో దర్జాగా తిరుగుతున్నావు. నీ భార్య మాత్రం నీ పిల్లలను చూసుకోవడంలోనే మునిగిపోయింది. పైగా నువ్వే అసలైన బాధితుడివి అని ఏడుస్తున్నావ్. నువ్వు చేసిన పని నీ భార్య చేసుంటే? విడాకులు ఫైనలైజ్ కాకముందే మరో మగాడితో ఆర్తి బయట తిరుగుతే ఈ ప్రపంచం ఊరుకుంటుందా?
అదే పని ఆర్తి చేస్తే..
ఒకవేళ తిరిగిన తర్వాత కూడా నేనే అసలైన బాధితురాలిని అని చెప్తే అందరూ నమ్ముతారా? లేదు కదా.. నువ్విలా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం చాలా చెండాలంగా ఉంది అని ఆగ్రహించింది. ఈ పోస్ట్‌ను ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నిశ్శబ్ధంగా ఉండటానికి బదులుగా నిజాయితీగా గొంతెత్తి ప్రశ్నించినందుకు గర్వంగా ఉంది.. అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది.
చదవండి: వారి కాళ్లకు నమస్కరించడం తప్ప ఏం చేయగలం?: మోహన్‌బాబు


