
హీరోయిన్లు సాధారణంగా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సినిమాల విషయంలో సాహసాలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా తేడా కొడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు మాత్రం అది వర్కౌట్ అవ్వొచ్చు. రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ రష్మిక కూడా అలాంటి ఓ డేరింగ్ స్టెప్ తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా వరస సినిమాలతో హిట్స్ కొట్టిన రష్మిక, పాన్ ఇండియా మార్కెట్‌లో వేలకోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన చిత్రాల్లో భాగమైంది. కొన్నిరోజుల ముందు రిలీజైన 'కుబేర'తోనూ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. వీటితో పాటు ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ భాగమైనట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?)
'పుష్ప 2' తర్వాత బన్నీ, తమిళ దర్శకుడు అట్లీతో పనిచేస్తున్నాడు. ఇదివరకే షూటింగ్ మొదలైపోయింది. దీపికా పదుకొణెని హీరోయిన్‌గానూ అనౌన్స్ చేశారు. మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. రష్మిక కూడా ఇందులో కీ రోల్ చేస్తుందని రూమర్ వచ్చినప్పుడు ఇంకెంత మంది హీరోయిన్లకు చోటుందా అని అనుకున్నారు. అయితే రష్మికది హీరోయిన్ రోల్ కాదని టాక్.
బన్నీతో తలపడే నెగిటివ్ రోల్‌లో రష్మిక కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం వేరే లెవల్ ఉండొచ్చు. గతంలో కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. మరి రష్మిక కూడా అలాంటి డెసిషన్ తీసుకుందా లేదా అనేది కొన్నిరోజుల్లో తేలుతుంది.
(ఇదీ చదవండి: నాగచైతన్యపై ఆ రూమర్స్ నిజం కాదు)