హన్సిక విడాకులు.. మాజీ వదిన షాకింగ్‌ పోస్ట్‌! | Hansika Motwani Ex Sister In Law Interesting Post On Instagram , After Divorce | Sakshi
Sakshi News home page

హన్సిక విడాకులు.. మాజీ వదిన షాకింగ్‌ పోస్ట్‌!

Mar 15 2026 12:04 PM | Updated on Mar 15 2026 1:36 PM

Hansika Motwani Ex Sister In Law Interesting Post On Instagram , After Divorce

దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తన భర్త సోహైల్‌ నుంచి ఆమె విడాకులు తీసుకోవడమే ఈ చర్చకు కారణం. 2022లో సోహైల్‌ను పెళ్లి చేసుకున్న ఆమె నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసి..ఇటీవల విడిపోయారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత హన్సిక పర్సనల్‌ లైఫ్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్సిక మాజీ వదిన ముస్కాన్ నాన్సీ చేసిన  పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదంతా ఒక నకిలీ ప్రపంచం అంటూ  చేసిన వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ముస్కాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. ‘దయచేసి నన్ను ఇతరుల జీవితాల్లో జరిగే డ్రామాల్లోకి లాగవద్దు. నాకు ఎలాంటి పెయిడ్ పీఆర్ టీమ్స్ లేవు. ఎవరిదో  ఫేక్‌ ప్రపంచంతో నన్ను ముడిపెట్టడం ఆపేయండి. కాలమే అన్ని నిజాలను బయటపెడుతుంది. అంతా సమయమే నిర్ణయిస్తుంది. సబ్ సమయ్ కా ఖేల్ హై. పీస్, లవ్ అండ్ కర్మ’ అని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసింది. ఎవరి పేరు నేరుగా చెప్పకపోయినా, ఈ పోస్ట్ హన్సిక విడాకులను ఉద్దేశించేనని నెటిజన్లు అంటున్నారు.

వాస్తవానికి హన్సికకు, ముస్కాన్‌కు మధ్య గతంలోనే విభేదాలు ఉన్నాయి. హన్సిక వల్లే తన సంసార జీవితం నాశనం అయిందని ముస్కాన్‌ ఆరోపించింది. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీతో ముస్కాన్‌ పెళ్లి జరిగింది. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని అత్త, ఆడపడుచు హన్సిక  వేధించారని ముస్కాన్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.వీరిద్దరి జోక్యం వల్లే తన కాపురం కూలిపోయిందని, మానసిక ఒత్తిడి కారణంగా తనకు 'బెల్స్ పాల్సీ'  కూడా వచ్చిందని ఆమె గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులోనే ఉంది.ఈ కేసును కొట్టివేయాలని హన్సిక వేసిన పిటిషన్‌ను గత సెప్టెంబర్‌లో బాంబే హైకోర్టు తిరస్కరించడం గమనార్హం.

ముస్కాన్‌ నాన్సీ విషయానికొస్తే..  ఈమె ఒక బుల్లితెర నటి.  తొడి ఖుషి తొడె ఘమ్‌ సీరియల్‌లో సహాయక నటిగా యాక్ట్‌ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్‌ ఆఫర్‌ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్‌, ఫియర్‌ ఫైల్స్‌, క్రైమ్‌ పెట్రోల్‌ షోలలో పాల్గొంది. భారత్‌ కా వీర్‌ పుత్ర: మహారాణ ప్రతాప్‌, ఏజెంట్‌ రాఘవ్‌- క్రైమ్‌ బ్రాంచ్‌ షోలలో నటించింది.  2020లో హన్సిక సోదరుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే విబేధాలు రావడంతో విడి విడిగా ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement