
టాలీవుడ్‌లోని మంచి నటుల్లో సత్యదేవ్ ఒకరు. రీసెంట్‌గా వచ్చిన 'కింగ్డమ్' చిత్రంతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అయితే రిలీజ్ తర్వాత ఓ వెబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇతడు.. తనని నెగిటివ్ పాత్రలకే పరిమితం చేయాలనుకున్నారని, ఓ నిర్మాత తన మూవీస్ గురించి చెప్పిన మాటలకు చాలా బాధేసిందని అన్నాడు. గతంలో జరిగిన చేదు సంఘటనల గురించి బయటపెట్టాడు.
'ఒకసారి ఓ పెద్ద నిర్మాత కలిశారు. ఆయన సినిమాలో విలన్‌గా చేయమన్నారు. నేను చేయనని చెప్పాను. ఎందుకు చేయవని అడిగారు. హీరోగా చేసుకుంటానని అంటే.. ఎందుకు విలన్‌గా చేసుకోవచ్చు కదా! విలన్ అవ్వు ఒకవేళ అలా చేస్తే.. పెద్ద హీరోలందరూ ఓ మూడు నాలుగు సినిమాలకు పెట్టుకుంటారు. నీ మూవీస్ ఎలానూ ఆడవు కదా అని నా ముఖం మీదే చెప్పాడు. అప్పుడు చాలా బాధేసింది'
(ఇదీ చదవండి: 'జయం' నుంచి బన్నీని తీసేశారు.. ఆ కోపంతో 'గంగోత్రి': చిన్నికృష్ణ)
'నేనేమో బాగానే చేస్తాను కదా, ఎందుకు సినిమాలు ఆడట్లేదు అనే స్పేస్‌లో ఉన్నాను. మరోవైపు బాగా చేస్తావు కదా విలన్ అయిపో అని అందరూ అనేవారు. బాగా చేస్తే హీరో అవ్వాలి కదా విలన్ అవ్వడమేంటి అనేది నా పాయింట్. అలా నిర్మాత అనేసరికి చాలా స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యాను. ఎందుకలా అలా నన్ను కేటగిరీ చేస్తున్నారని అనిపించింది' అని సత్యదేవ్ చెప్పుకొచ్చారు.
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో సత్యదేవ్ విలన్‌గా చేయడం వల్లే ఆ తరహా పాత్రలు సత్యదేవ్ వరకు వచ్చాయి. చిరంజీవి పక్కన నెగిటివ్ పాత్ర చేయడానికి ఓ కారణం ఉందని.. ఆయన సినిమాలో నటిస్తే, దర్శకుల కంట్లో పడొచ్చని తనని కన్విన్స్ చేయడంతోనే ఆ చిత్రంలో నటించేందుకు ఒప్పుకొన్నానని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్' నాలుగున్నర గంటల ఫుటేజ్: నిర్మాత)