
బెట్టింగ్ యాప్ కేసులో.. నేడు (ఆగస్టు 06) ఈడీ విచారణ జరగనుంది. నటుడు విజయ్ దేవరకొండ అధికారుల ముందు హాజరు కానున్నాడు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌ని ఈడీ అధికారులు విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈయన.. మరోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పాడు. మరి ఈ రోజు విజయ్ దేవరకొండ ఏం చెబుతాడో చూడాలి?
(ఇదీ చదవండి: నా సొంతిల్లు తాకట్టు పెట్టి సినిమా తీశా: 'మహావతార్ నరసింహా' డైరెక్టర్)
విజయ్ దేవరకొండతో పాటు 'బాహుబలి' నటుడు రానా.. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఇవాళ విజయ్ దేవరకొండ విచారణకు హాజరైతే మనీ లాండరింగ్ కోణాల్లో విచారణ జరపనున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్స్ గురించి ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్స్, ఎందుకు ప్రమోషన్ చెయ్యాల్సి వచ్చింది? అలానే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: రష్మీతో మనస్పర్థలు.. నిజం బయటపెట్టిన అనసూయ)