breaking news
David Reddy
-
మూడు వారాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నా.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్
పాత్రకు తగ్గట్లుగా తన శరీరాన్ని మార్చుకొనే అతి కొద్దిమంది నటుల్లో మంచు మనోజ్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటాడు. బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉన్నా సరే.. ఆయన నటనకు మాత్రం ఎప్పుడూ నెగెటివ్ కామెంట్స్ రాలేదు. గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమైన మనోజ్.. మిరాయ్ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన శక్తివంతమైన విలన్ పాత్ర అయిన మహాబీర్ లామా..‘బ్లాక్ స్వోర్డ్’గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా మనోజ్ చేసిన పవర్ఫుల్ పెర్ఫామెన్స్‌కు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు లభించాయి.ఇప్పుడు మంచు మనోజ్ మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అదే డేవిడ్ రెడ్డి. తన కెరీర్లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఇది రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం మనోజ్ తన లుక్‌ని మార్చేస్తున్నాడు. యోధుడిలా కనిపించేందుకు మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానంటూ వర్కౌట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. “మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని ఆయన రాశారు. ఇదే క్రమంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేరు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని ఆయన అన్నారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) ఇకపై కేవలం లుక్ కోసం కాకాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం “ ధృడమైన వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్డేట్ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియజేశారు.డేవిడ్ రెడ్డి విషయానికొస్తే.. 1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది. -
'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్.. గ్లింప్స్ వేడుకలో యూనిట్ ( ఫోటోలు)
-
'ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై..' మంచు మనోజ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్సే..!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డేవిడ్ రెడ్డి. ఈ చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మంచు మనోజ్ లుక్, వార్ డాగ్ బైక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నెేల కరిగింది' ..' ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై.. ఏ డేవిడ్ రెడ్డికా ఇండియా హై' అనే డైలాగ్స్ మంచు మనోజ్ ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.ఇవాళ విడుదలైన డేవిడ్ రెడ్డి టీజర్ గ్లింప్స్ చూస్తుంటే జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో విజువల్స్, డైలాగ్స్, డేవిడ్ రెడ్డి బైక్ ఈ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. గ్లింప్స్ చూడగానే పీరియాడికల్ మూవీ అని చెప్పేయొచ్చు. తాజా గ్లింప్స్‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ చిత్రం కోసం మంచు మనోజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.War Dog… Ready to Roar 🔥🔥🔥Speed of #DavidReddy. A revolutionary tale that has become a part of me. Created something powerful with @itshanumareddy, something all of us will be proud of ❤️❤️ 🏍️ pic.twitter.com/Q9nGga1lSn— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 17, 2025 -
‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్.. పోస్టర్‌తో అంచనాలు పెంచేశారే!
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. దీనికి ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్ పెట్టినట్లు ప్రకటిస్తూ.. పోస్టర్ని విడుదల చేశారు.ఈ హిస్టారికల్ యాక్షన్ సినిమాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. 1897 - 1922 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందనుంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అంశాలతో ఉత్కంఠభరితమైన కథతో సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో మనోజ్ మంచు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారు. బ్రిటిష్ పాలనను సవాలు చేయడానికి కుల అణచివేత నుంచి లేచిన ధైర్యవంతుడైన తిరుగుబాటు దారుడిగా కనిపించబోతున్నాడట. టైటిల్ పోస్టర్‌తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు."మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, ఢిల్లీలో పెరిగాడు. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు" అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంతో పాటు ‘మిరాయ్’, వాట్ ది ఫిష్‌లోనూ మనోజ్ నటిస్తున్నారు.With a heart full of gratitude… 🙏Today marks 21 years of my journey in cinema. I feel truly blessed to be still doing what I love.And with the same love and hope, sharing my 21st film titled #DavidReddy ❤️🔥A raw, intense, high-octane historical action drama set between… pic.twitter.com/aRZhjoL1jx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 6, 2025


