
సాక్షి, హైదరాబాద్: 'నేను కేవలం గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశాను, బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోట్ చేయలేదు' అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన కాంట్రాక్ట్, తీసుకున్న డబ్బు.. సహా అన్ని వివరాలను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులకు ఇచ్చానని తెలిపాడు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే! ఈ కేసులో విచారణకు రమ్మంటూ విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే బుధవారం ఆయన ఈడీ ఎదుట హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు హీరోను విచారించారు. విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడాడు. బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. కానీ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశాను.
విచారణకు సహకరించా..
A23 అనేది గేమింగ్ యాప్. చాలా రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్ లీగల్. వీటికి జీఎస్టీ, ట్యాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్.. ఇలా అన్నీ ఉంటాయి. ఈ గేమింగ్ యాప్స్.. ఐపీఎల్, కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్స్‌కు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణలో ఓపెన్ అవ్వదు. నా బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలన్నింటినీ ఈడీకి ఇచ్చాను. అధికారుల విచారణకు సహకరించాను అని పేర్కొన్నాడు.
చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం!