బిగ్‌బాస్ ఫేం, నటి సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతోంది.
ఇటీవలే ఆమె సీమంతం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ సహా బుల్లితెర నటీనటులు హాజరయ్యారు.
తన సీమంతం ఫంక్షన్ ఫోటోలను ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా సోనియా ఆకుల.. జార్జ్ రెడ్డి, కరోనా వైరస్, ఆశా ఎన్‌కౌంటర్ సినిమాల్లో నటించింది.
గతేడాది తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొంది.
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ప్రియుడు యష్‌ను పెళ్లాడింది.


