రవితేజ (Ravi teja), శ్రీలీల జోడీగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మాస్ జాతర’.. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత రేంజ్‌లో మెప్పించలేదు. అయితే, తాజాగా ఆ మూవీ నుంచి వివాదస్పందంగా మారిన ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
‘మాస్ జాతర’ నుంచి ఓలే ఓలే సాంగ్ వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. వాస్తవంగా ఈ సాంగ్ లిరిక్స్ పట్ల చాలామంది విమర్శించారు. లిరిక్స్ లో ఎక్కువగా బూతులే ఉన్నాయంటూ వెంటనే ఆ సాంగ్‌ను తొలగించాలని కూడా సోషల్‌మీడియాలో చాలామంది డిమాండ్ చేశారు. ఇందులోని లిరిక్స్‌కు ఎలాంటి అర్ధం- పర్థం లేదంటూ కామెంట్లు చేశారు. తలా తోక లేదు ఆపై రాగం, తాళం లేదంటూ పేర్కొన్నారు. ఈ పాట రచయితతో పాటు, రవితేజ, శ్రీలీల పట్ల కూడా వ్యతిరేఖత వచ్చింది. అయితే, ఇప్పుడు ఏకంగా వీడియో వర్షన్‌ను విడుదల చేశారు.


