
ఆగస్టులో థియేటర్స్‌లో మాస్ జాతర అంటున్నారట రవితేజ. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బాస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్ భేరి అనేపోలీసాఫీసర్‌పాత్రలో రవితేజ, విలన్‌గా నవీన్ చంద్ర నటిస్తున్నారని తెలిసింది.
ఈ సినిమా టాకీపార్టు చిత్రీకరణ దాదాపు పూర్తయింది.పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. కాగా ‘మాస్ జాతర’ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.