
పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అవి జరగకుండా జాగ్రత్తపడాలి. లేదంటే, ఇదిగో.. ఇలా ట్రోలింగ్ బారిన పడటం ఖాయం! బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి, మోడల్ నివాశియ్ని కృష్ణన్ (Nivaashiyni Krishnan) గ్లామర్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్‌ను హీరో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీపోస్ట్ చేశారు.
చిన్న తప్పిదం!
ఇది గమనించిన కొందరు నెటిజన్లు వెంటనే దాన్ని స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జరిగిన తప్పును గ్రహించిన ఉదయనిధి.. వెంటనే సదరు పోస్ట్‌ను డిలీట్ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అటు నివాశి గ్లామర్ పోస్ట్‌కు కామెంట్లను ఆఫ్ చేసింది. అప్పటికీ నెటిజన్లు ఆగడం లేదు.. వేరే పోస్టుల కిందకు వెళ్లి మరీ కామెంట్స్ చేస్తున్నారు. మా అన్న ఎలా ఉన్నారు? డీఎంకే పార్టీలోకి స్వాగతం అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఎవరా బ్యూటీ?
అటు ఉదయనిధి అభిమానులు మాత్రం ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. పొరపాటను ఉదయనిధి చేయి టచ్ అయి అలా రీపోస్ట్ అయిందని సమర్థిస్తున్నారు. నివాశి విషయానికి వస్తే.. తమిళనాడు మూలాలున్న నివాశి సింగపూర్‌లో మోడల్‌గా రాణిస్తోంది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసినట్లు తెలుస్తోంది. తమిళ బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో కామనర్‌గా పాల్గొంది. ఓహో ఎంతన్ బేబీ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది.
Udhaya Anna 🤣❤️🔥
Sunday rowdy time
Monday Ena time ??? 🤣 pic.twitter.com/tTjI2UkpNT— விழுப்புரம் கிருபா (@Admk_Kiruba) October 21, 2025
చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ