నటిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. గత రెండు మూడేళ్లుగా మాత్రం పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిస్తోంది. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. టర్కీలో జరిగిన ఏసియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు మెడల్స్ సాధించింది.
(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?)
నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది హైదరాబాద్ జిల్లా లెవల్, తెలంగాణ స్టేట్ లెవల్ పోటీల్లో బంగారు పతకం గెల్చుకుంది. కేరళలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. 2023 నుండి ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రగతి... గత రెండేళ్లలో పలు పతకాలు సాధించింది. ఇప్పుడు ఏసియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారంతోపాటు వెండి పతకాలు గెల్చుకుంది.
టర్కీలో జరిగిన పోటీలు అనంతరం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రగతి.. ఓవరాల్‌గా వెండి పతకం గెల్చుకున్నానని.. డెడ్ లిఫ్ట్ విభాగంలో బంగారు పతకం, బెంచ్, స్క్వాడ్ విభాగంలో రెండు వెండి పతకాలు సాధించానని గర్వంగా చెప్పుకొచ్చింది. ఈ మేరకు వీడియోలు, ఫొటోలతో ఉన్న ఓ పోస్ట్‌ని తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
(ఇదీ చదవండి: బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?)


